Begin typing your search above and press return to search.

NBK109 కి 'యానిమల్‌' తో లింక్‌..!

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు అంటూ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 7:02 AM GMT
NBK109 కి యానిమల్‌ తో లింక్‌..!
X

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు అంటూ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. బాలయ్య కూడా అదే జోష్‌ తో దూసుకు పోతున్నాడు. ఇప్పటికే తదుపరి సినిమా ను బాబీ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. ఒక పక్కా మాస్ కమర్షియల్‌ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది అంటున్నారు.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న సితార ఎంటర్ టైన్‌మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాబీ కి ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చి మరీ నిర్మాత నాగ వంశీ ఈ సినిమా కు ఖర్చు చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నటీనటుల ఎంపిక విషయంలో కాస్త ఎక్కువగానే బాబీ ఖర్చు చేస్తున్నాడని సమాచారం అందుతోంది.

ఇప్పటికే ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ను కీలక పాత్ర కోసం దర్శకుడు బాబీ సంప్రదించాడని, ఆయన ఓకే అన్నాడని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ను నటింపజేసేందుకు గాను బాబీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొంది వచ్చే వారం విడుదల అవ్వబోతున్న యానిమల్‌ సినిమా లో బాబీ డియోల్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ట్రైలర్ లో బాబీ డియోల్‌ పాత్ర పై చాలా ఆసక్తిని ప్రేక్షకులు కనబర్చుతున్నారు. యానిమల్‌ సినిమా తర్వాత బాబీ డియోల్‌ మరో సౌత్‌ దర్శకుడితో వర్క్‌ చేయబోతున్నాడని, అది బాలయ్య సినిమా అన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి బాలయ్య సినిమా హడావుడి బాలీవుడ్ వరకు కనిపిస్తోంది. బాబీ డియోల్‌ ను రంగంలోకి దించితే కచ్చితంగా బాలయ్య, బాబీ మూవీ కి పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా టాక్ వస్తుంది. అక్కడ కూడా భారీ రిలీజ్ కు ఛాన్స్ ఉంటుందని నెటిజన్స్ మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.