Begin typing your search above and press return to search.

NBK109 లో సర్‌ప్రైజింగ్ లేడీ స్టార్‌

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలు దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న NBK109 పై అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   7 Dec 2023 11:12 AM GMT
NBK109 లో సర్‌ప్రైజింగ్ లేడీ స్టార్‌
X

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలు దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న NBK109 పై అంచనాలు భారీగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య వంటి మాస్ హిట్ మూవీ తర్వాత బాబీ రూపొందిస్తున్న సినిమా ఇదే అవ్వడం తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

భగవంత్ కేసరి విడుదలకు ముందే ఒక షెడ్యూల్‌ ని ముగించిన బాలకృష్ణ వచ్చే వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను స్పీడ్ గా షూటింగ్‌ ను ముగించే ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ సినిమా పూర్తి చేయాలని దర్శకుడు బాబీ తో బాలయ్య చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే NBK109 సినిమా హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా వైజాగ్‌ అమ్మాయి చాందిని చౌదరి ఈ సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. ఆమె హీరోయిన్ పాత్ర అయ్యి ఉండదు. ఆమె పాత్ర ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా తాను ఈ సినిమా లో నటిస్తున్నట్లుగా క్లారిటీ ఇస్తూ చాందిని ఈ ఫోటోను షేర్ చేసింది.

భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పాత్ర తరహాలో చాందిని పాత్ర ఈ సినిమాలో ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. తెలుగు అమ్మాయి అయిన చాందిని చౌదరి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఈమె నటించిన కలర్ ఫోటో సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెల్సిందే.

హీరోయిన్‌ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో త్వరలోనే బాబీ టీమ్ క్లారిటీ ఇస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి టైటిల్‌ ను ప్రకటించాలని బాబీ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సంక్రాంతికే సినిమా విడుదల పై కూడా క్లారిటీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి.