Begin typing your search above and press return to search.

మాస్ దర్శకులందరు బాలయ్య వెంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 April 2024 7:30 AM GMT
మాస్ దర్శకులందరు బాలయ్య వెంటే..
X

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అలాగే వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఆయన కెరియర్ లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నారు. NBK ను ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందనేది దర్శకులకి ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మాస్ యాక్షన్ ప్యాక్డ్ కథలతోనే సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. బాలకృష్ణ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

దీని తర్వాత తనకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ చేయనున్నాడు. ఈ సినిమాకి కథని సిద్ధం చేసుకునే పనిలో బోయపాటి ఉన్నారు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా అలా సినిమా చేయనున్నాడు. అయితే మూవీ స్టార్ట్ అయ్యేసరికి సమయం పట్టొచ్చు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక పౌరాణిక చిత్రం చేయాలనే ప్లాన్ లో ఉన్నారంట. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందనేది తెలియదు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి ఒకే చెప్పారు.

వీరి కలయికలో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక మూవీ చేయాల్సి ఉంది. ఈ సినిమాలు అన్ని బ్యాక్ టూ బ్యాక్ ఉండొచ్చని. టాక్. బాలయ్య లైన్ అప్ లో ఉన్న దర్శకులతో పర్ఫెక్ట్ మాస్ సినిమాలు పడితే 200 కోట్ల కలెక్షన్స్ సునాయాసంగా అందుకుంటారనే మాట వినిపిస్తోంది.

నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణను పాన్ ఇండియా స్టార్ గా చూడాలని ఆశ పడుతున్నారు. త్వరలో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. అఖండ 2 చిత్రాన్ని బోయపాటి పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఏమైనా వరల్డ్ వైడ్ గా బాలయ్య ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుందేమో వేచి చూడాలి.