Begin typing your search above and press return to search.

విరామానికి ముందు న‌ట‌సింహం గ‌ర్జ‌న‌!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా 109వ చిత్రం షూటింగ్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర వేగంగా జ‌రుగు తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Feb 2024 3:58 AM GMT
విరామానికి ముందు న‌ట‌సింహం గ‌ర్జ‌న‌!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా 109వ చిత్రం షూటింగ్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర వేగంగా జ‌రుగు తోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మాస్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తూ భారీ అంచ‌నాల మ‌ధ్య మాస్ కా బాప్ అనిపించిన బాబి తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. దీంతో అంచ‌నాలు సినిమాపై అంత‌కంత‌కు రెట్టింపు అవుతు న్నాయి. బాల‌య్య ని ఎంత‌టి మాస్ రోల్ లో చూపిస్తున్నాడు? అత‌డి లుక్ ఎలా ఉండ‌బోతుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది.

ఈ నేప‌థ్యంలో సినిమా గురించి సాలిడ్ అప్ డేట్ బ‌య‌ట‌కొచ్చింది. ప్ర‌స్తుతం విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాల్ని హైదరాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు. దీనిలో భాగంగా బాల‌య్య‌పై కొన్ని భారీ యాక్ష‌న్ స‌న్నివే శాలు కూడా చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలిసింది. ఇవ‌న్నీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ స‌న్నివేశాల‌గా తెలుస్తోంది. బాల య్య సినిమాలో ఇంట‌ర్వెల్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌య్య మాస్ ఫాలోయింగ్ లో అరుపులు పెట్టించేలా ఆ సీన్స్ ఉంటాయి.

అలాంటి సీన్స్ తో బాబి ఇప్పుడు అంత‌కు మించి అనిపించ‌డంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి ..ర‌వితేజ లాంటి స్టార్ హీరోల్ని మాస్ హీరోగా బాబి ఎలా ఆవిష్క‌రించాడో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాల య్య‌తో అలాంటి మాస్ స‌న్నివేశాలు పండితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకు తగ్గ‌ట్టే ఇంటర్వెల్ బ్యాంగ్..క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్లు ఉంటాయని చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. ఇందులో బాల‌య్య‌ని ఢీ కొట్ట పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు బాబి డియోల్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

`యానిమ‌ల్` లో సందీప్ రెడ్డి వంగా బాబి డియోల్ పాత్ర‌ని ఓ రేంజ్ లో హైలైట్ చేసాడు. ఈ సినిమాతో బాబి డియోల్కి మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు బాల‌య్య వ‌ర్సెస్ బాబి డియోల్ సెట్ అయిన నేప‌థ్యంలో క్యూరియాసిటీ రెట్టింపు అవుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు కొంత టాకీ పార్టు కూడా షూట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో బాల‌య్య‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ వివ‌రాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని నాగ‌వంశీ..సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.