Begin typing your search above and press return to search.

బాలయ్య.. బిజినెస్ జోరు మామూలుగా లేదు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ లెజెండ్ చేసేంత వరకు బాలయ్య ఖాతాలో సక్సెస్ లేదు

By:  Tupaki Desk   |   11 Feb 2024 4:29 AM GMT
బాలయ్య.. బిజినెస్ జోరు మామూలుగా లేదు
X

బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకడిగా ఉన్న గతంలో కెరియర్ పరంగా ఒక హిట్ పడితే మూడు, నాలుగు ఫ్లాప్ మూవీస్ పడుతూ ఉండేవి. అందుకే మార్కెట్ పరంగా మెగాస్టార్ చిరంజీవి స్థాయిలో హైప్ ని తెచ్చుకోలేకపోయారు. అయితే అఖండ నుంచి కంప్లీట్ గా చేంజ్ అయిపొయింది. ఓ విధంగా బోయపాటి బాలకృష్ణ మార్కెట్ ని అమాంతం పెంచేశారని చెప్పాలి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ లెజెండ్ చేసేంత వరకు బాలయ్య ఖాతాలో సక్సెస్ లేదు. ఆ సినిమా హిట్ అయిన మళ్ళీ వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అఖండ మూవీతో బాలయ్యకి బోయపాటి హ్యాట్రిక్ సక్సెస్ లు ఇచ్చారు. అఖండ ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో కానీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

ఆ తరువాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బాలయ్య బాబు మార్కెట్ ని అమాంతం పెంచేసింది. ఈ మూడు చిత్రాలు 80 నుంచి 100 కోట్ల మధ్య షేర్ ని రాబట్టాయి. అలాగే నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా కూడా ఈ మూడు చిత్రాలకి భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయి

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ బడ్జెట్ 100 కోట్ల పైనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోందని తెలుస్తోంది. గతంలో బాలయ్యతో సినిమాలంటే భయపడే నిర్మాతలు ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ ఈయన పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కారణం థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ కలిపి ఆయన సినిమాలకి 100 కోట్ల వరకు మార్కెట్ ఉంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు భారీగా పెట్టడానికి ముందుకి వస్తున్నారు. బాబీ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ ఒకటి బాలయ్య చేయాల్సి ఉంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ చేయనున్నాడు. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే బాలయ్య కూడా పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.