Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ తో బాలయ్య.. అసలు విషయం ఇది..!

బోయపాటి బాలకృష్ణ ఈ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్, అఖండ మూడు హ్యాట్రిక్ హిట్లు గా నిలిచాయి.

By:  Tupaki Desk   |   29 Jan 2024 11:02 AM GMT
గీతా ఆర్ట్స్ తో బాలయ్య.. అసలు విషయం ఇది..!
X

నందమూరి బాలకృష్ణ తో గీతా ఆర్ట్స్ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. బాలకృష్ణతో ఆహా OTTలో అన్ స్టాపబుల్ షో చేశారు అల్లు అరవింద్. ఆ షో గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో అప్పటి నుంచి వీరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏదైనా టైం చూసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. రీసెంట్ గా బోయపాటి శ్రీనుతో అల్లు అరవింద్ కలిసి ఒక సినిమా అనౌన్స్ చేశారు. అయితే అందరు అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను కలిసింది బాలకృష్ణ సినిమా కోసమని తెలుస్తుంది.

బోయపాటి బాలకృష్ణ ఈ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్, అఖండ మూడు హ్యాట్రిక్ హిట్లు గా నిలిచాయి. మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. అయితే ఈసారి మెగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో ఈ సినిమా రావడం ప్రత్యేకంగా నిలుస్తుంది. గీతా ఆర్ట్స్ తో బాలకృష్ణ సినిమా అటు ఫ్యాన్స్ లో కూడా సూపర్ ఎగ్జైట్మెంట్ కలిగేలా చేస్తుంది.

బోయపాటి బాలకృష్ణ కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గానే ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. అఖండ 2 కథ సిద్ధం చేసే పనిలో బోయపాటి బిజీగా ఉన్నారు. బాలయ్య కూడా బాబీ డైరెక్షన్ లో సినిమా పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్తుంది. ఐతే అఖండ ద్వారా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి సీక్వెల్ కి గీతా ఆర్ట్స్ చేతుల్లోకి వచ్చింది. ఆ నిర్మాత నుంచి క్లియరెన్స్ తీసుకున్నాకే ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరుగుతుందని తెలుస్తుంది.

అన్ స్టాపబుల్ తో మరింత దగ్గరైన అల్లు అరవింద్, బాలకృష్ణ ఈసారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలకృష్ణతో సినిమా చేయాలని కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న గీతా ఆర్ట్స్ ఫైనల్ గా అఖండ 2 ని లాక్ చేసింది. స్కంద నిరాశపరచినా బాలకృష్ణ అఖండ 2 కోసం బోయపాటి కూడా అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. బోయపాటి.. బాలకృష్ణ.. అల్లు అరవింద్ ఈ కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.