Begin typing your search above and press return to search.

బాలకృష్ణతో - బాబీ.. అసలు ప్లానేంటి?

ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మరల షూటింగ్ స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా ఫినిష్ చేసి దసరాకి మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:24 AM GMT
బాలకృష్ణతో - బాబీ.. అసలు ప్లానేంటి?
X

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నారు. యంగ్ డైరెక్టర్స్ తో తనకి సెట్ అయ్యే మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలు చేస్తూ వస్తున్నారు. అనిల్ రావిపూడితో గత ఏడాది భగవంత్ కేసరి చేసి బ్లాక్ బస్టర్ ని బాలయ్య ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. వాల్తేర్ వీరయ్య లాంటి సక్సెస్ తర్వాత బాబీ చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందంట. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి నడుస్తోంది. బాలయ్య మళ్ళీ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఈ సారి గెలిస్తే ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొడతాడు. ఎలక్షన్స్ సమయంలో బాలయ్య కాంబినేషన్ లేని సన్నివేశాలు షూటింగ్ చేయాలని డైరెక్టర్ బాబీ ప్లాన్ చేసుకుంటున్నారంట.

ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మరల షూటింగ్ స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా ఫినిష్ చేసి దసరాకి మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు. బాలయ్య స్టైల్ లో కంప్లీట్ మాస్ కమర్షియల్ యాక్షన్ జోనర్ లోనే ఈ మూవీని బాబీ డిజైన్ చేస్తున్నారు. దీంతో ఈ మరో బ్లాక్ బస్టర్ హిట్ బాలయ్య ఖాతాలో పడబోతోందనే మాట అభిమానుల నుంచి వినిపిస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తోంది.

బాలయ్య త్వరలో ఎలక్షన్ క్యాంపైన్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో బాలయ్య పర్యటించబోతున్నారు. ఎలక్షన్ క్యాంపైన్ జరిగేంత వరకు సినిమాలని పూర్తిగా పక్కన పెట్టనున్నారు. మళ్ళీ ఎన్నికల హడావిడి ముగిశాక బాబీ సినిమాని కంప్లీట్ చేసి తర్వాత బోయపాటితో అఖండ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య మూవీ చేయనున్నాడు. ఇలా వరుసగా ప్రాజెక్ట్స్ ని బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలలో ఎన్ని సూపర్ హిట్ అయ్యి బాలయ్య ఇమేజ్ ని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకొని వెళ్తాయనేది చూడాలి.