Begin typing your search above and press return to search.

బాలయ్య - బాబీ సస్పెన్స్‌ అందుకేనా?

బాబీ ఎందుకు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం లేదు అంటూ చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 8:20 AM GMT
బాలయ్య - బాబీ సస్పెన్స్‌ అందుకేనా?
X

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మూడు విజయాలతో దూకుడు మీదున్న బాలయ్య ప్రస్తుతం వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్ లో నటిస్తున్నాడు.

సినిమా ప్రారంభం అయ్యి చాలా నెలలు అయ్యింది. షూటింగ్ కూడా పూర్తి అవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మేకర్స్‌ నుంచి సినిమా యొక్క ఫస్ట్‌ లుక్ రాకపోవడం విడ్డూరంగా ఉందని ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాబీ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

బాబీ ఎందుకు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం లేదు అంటూ చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని అందుకే మేకర్స్ సినిమా లుక్ ను సీక్రెట్‌ గా ఉంచుతున్నారు అంటూ సమాచారం అందుతోంది.

బాలయ్య మరియు బాబీ కాంబో లో వస్తున్న సినిమాకు సంబంధించిన లుక్‌ విషయంలో సీక్రెట్‌ మెయింటెన్ చేస్తున్నారు. విభిన్నమైన లుక్‌ అవ్వడం వల్లే సినిమా విడుదల సమయంలో రివీల్‌ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని విధంగా బాలయ్య ను ఈ సినిమాలో బాబీ చూపించబోతున్నాడట. అందుకే సీక్రెట్‌ గా ఫస్ట్‌ లుక్ ను ఉంచుతున్నారు.