Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి ఒక్క రోజు ముందుకి… అందుకే వచ్చిందా?

ఇదే దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో మూవీ కూడా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   24 July 2023 4:25 AM GMT
భగవంత్ కేసరి ఒక్క రోజు ముందుకి… అందుకే వచ్చిందా?
X

నందమూరి బాలకృష్ణప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. బాలకృష్ణకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక క్రేజీ హీరోయిన్ శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో ఈ మూవీలో కనిపించబోతోంది.

తెలంగాణ నేపథ్యంలో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్య కెరియర్ లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథాశంతో మూవీ రాలేదని చెప్పాలి.

ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాలు చాలావరకు రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కినవే. అయితే మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి మాత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథని బాలయ్య కోసం ఎంచుకున్నారు.

ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలంగాణ స్లాంగ్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కూడా కనెక్ట్ అయ్యాయి. దీనితో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.

భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అక్టోబర్ 20న ముందుగా అనుకున్నారు. డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఊహించిన విధంగా ఇప్పుడు ఒక్కరోజు ముందుగా అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

రిలీజ్ డేట్ ఒకరోజు ముందుకు తీసుకురావడం వెనుక వేరే కారణం ఉందని తెలుస్తుంది. ఇదే దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో మూవీ కూడా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి రైట్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ రెండు సినిమాలు నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారు.

మెజారిటీ థియేటర్స్ దిల్ రాజు చేతిలో ఉంటాయి కాబట్టి రెండు సినిమాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే బాలయ్య ఈ సినిమాను ఒకరోజు ముందు రిలీజ్ చేయాలని సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట. దసరా వీకెండ్ కలిసి రావాలంటే ముందు వస్తేనే బాగుంటుందని చెప్పారంట. అలా అయితే లాంగ్ వీకెండ్ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.