Begin typing your search above and press return to search.

ఇది బాల‌య్య అభిమానుల‌కు పూన‌కం తెప్పించేదే!

న‌ట‌సింహ బాల‌కృష్ణ అంటే యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు పెట్టింది పేరు. సీమ ఫ్యాక్ష‌నిజం స్టోరీల నుంచి బోయ‌పాటి మార్క్ స్టోరీల వ‌ర‌కూ ఆయుధాలు ప‌ట్ట‌డం అన్న‌ది బాల‌య్య‌కే చెల్లింది.

By:  Tupaki Desk   |   15 Oct 2023 5:53 AM GMT
ఇది బాల‌య్య అభిమానుల‌కు పూన‌కం తెప్పించేదే!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ అంటే యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు పెట్టింది పేరు. సీమ ఫ్యాక్ష‌నిజం స్టోరీల నుంచి బోయ‌పాటి మార్క్ స్టోరీల వ‌ర‌కూ ఆయుధాలు ప‌ట్ట‌డం అన్న‌ది బాల‌య్య‌కే చెల్లింది. క‌త్తి ప‌ట్టాల న్నా..గొడ్డ‌లి చేత పట్టి ప్ర‌త్య‌ర్ధుల‌పై పిడుగులా దూసుకెళ్లాల‌న్నా! అది బాల‌య్య ఇమేజ్ కి మాత్ర‌మే స‌రితూగుతుంది. ఆ రేంజ్ ఎలివేష‌న్ కి స‌రితూగే ఏకైక న‌టుడు ఆయ‌న మాత్ర‌మే. ఆ కోణంలో బాల‌య్య మాస్ ఇమేజ్ ని మాత్ర‌మే ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేస్తారు. మ‌రే స్టార్ అలాంటి స‌న్నివేశాల్లో న‌టిస్తే! స‌న్నివేశం అంత‌గా పండ‌దు.

అందుకే బాల‌య్య‌తో వ‌రుస‌గా హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేయ‌గ‌లిగాడు బోయ‌పాటి. స‌రిగ్గా ఇదే లాజిక్ ని యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి `భ‌గ‌వంత్ కేస‌రి`లో బ్రిలియంట్ గా ప్ర‌జెంట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య మాస్ ఇమేజ్ ని ఏమాత్రం త‌గ్గించ‌కుండా త‌న‌దైన మార్క్ ఎంట‌ర్ టైనింగ్ గా క‌థ చెబుతూనే అల‌రించబోతున్నాడు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య ని కొత్త‌గా చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే బాల‌య్య‌తో ఏకంగా సరికొత్త ఆయుధాలు చేత‌ప‌ట్టించిన‌ట్లు అనీల్ రివీల్ చేసాడు.

ఇంత‌వ‌ర‌కూ బాల‌య్య‌ని పాత‌ర‌కం ఆయుధాల‌తోనే చూసారు. నా సినిమాలో కొత్త ర‌కం ఆయుధాల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌పై దాడికి దిగుతాడ‌ని బాల‌య్య అభిమానుల్లో పూన‌కాలు తెచ్చే హింట్ ఇచ్చేసారు. ప్ర‌త్య‌ర్ధి మీద‌క‌వి వ‌స్తే అక్క‌డిక్క‌డే ఆయుధాలు ఎలా స‌మ‌కూర్చుకుంటారు? వాటిని ఎలా త‌యారు చేస్తారు? అన్న‌ది తెర‌పైనే చూడాలం టున్నాడు. ఆయ‌న చేతిలో ఎన్ని ఆయుధాలున్నా..ఆయ‌న‌క‌న్నా పెద్ద ఆయుధం ఇంకేది ఉండ‌ద‌ని ఆ రేంజ్ లో బాల‌య్య చూపించ‌బోతున్నాడు.

బాల‌య్య‌పై త‌న అభిమాన‌మంతా సినిమాలో చూపించాన‌న్నారు. బాల‌య్య ఒకే పాత్ర‌లో క‌నిపించి నా..అందులో రెండు..మూడు కోణాలుంటాయ‌న్నారు. జైలులో మొద‌లైన క‌థ‌..అటుపై అమ్మాయి తో క‌లిసి ప్ర‌యాణం చేస్తూ త‌న ల‌క్ష్యం ఎలా చేరారు? అన్న‌ది తెర‌పై ఆస‌క్తిక‌రంగా చూపించ‌బోతున్నాం అన్నారు.