Begin typing your search above and press return to search.

NBK: మరోసారి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా విడుదల కాబోతోంది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 6:27 PM GMT
NBK: మరోసారి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
X

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు సాంగ్స్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు మరొక సాంగ్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. భగవంథ్ కేసరి సినిమా ను దర్శకుడు అనిల్ తన టైమింగ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి యాక్షన్ డోస్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

బాలకృష్ణ కటౌట్ కి తగ్గట్టుగా కూడా సీరియస్ సీన్స్ ఉన్నాయని పోస్టర్ల ద్వారానే తెలియజేశారు. ఇక సినిమాపై మంచి బజ్ పెరిగే విధంగా సాంగ్స్ అలాగే పోస్టర్లు మేకింగ్ వీడియోలు వరుసగా విడుదల చేస్తున్నారు. ఇక థమన్ సాంగ్స్ అయితే ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే క్లిక్ కాలేదు. ఇప్పుడు మరొక సాంగ్ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ఉయ్యాల ఉయ్యాల అనే కొత్త పాట అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో నందమూరి బాలకృష్ణ పక్కన ఒక చిన్నారి పాప కూర్చున్నట్లుగా ఉంది. ఇక బాలకృష్ణ కూతురిగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తోంది అని ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు. ఇక తనే ఆ పాప అయ్యి ఉంటుంది అని అర్థమవుతుంది.

ఇక చిన్నారి పాపల సెంటిమెంట్ అనేది ఇప్పటివరకు నందమూరి హీరోలకు బాగా కలిసి వచ్చిన అంశమే. ఎందుకంటే అఖండ సినిమాలో బాలయ్య బాబు కూడా చిన్నారి పాపతో చేసిన సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాలో కూడా పాప కోసమే బ్రిటిష్ వాళ్లతో రామ్ చరణ్తో పోరాటం హైలైట్ అయింది.

ఇక మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో కూడా మేజర్ కథ చిన్నారి పాప చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నందమూరి హీరోల సినిమాలలో చిన్నారి పాప పాయింట్ ఉంది అంటే ఆ సినిమా సక్సెస్ అయినట్లే అని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఇక ఈసారి అనిల్ రావిపూడి శ్రీలీల కు సంబంధించిన చిన్నారి ఎపిసోడ్స్ ను కూడా ఈ సినిమాలో హైలెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఈ సెంటిమెంట్ భగవంథ్ కేసరికి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.