Begin typing your search above and press return to search.

బాలయ్య - బాబీ మూవీ... బిగ్ గుడ్‌ న్యూస్‌

నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ గ్యాప్ లేకుండా జరుగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 5:29 AM GMT
బాలయ్య - బాబీ మూవీ... బిగ్ గుడ్‌ న్యూస్‌
X

నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ గ్యాప్ లేకుండా జరుగుతూనే ఉంది. వీరిద్దరి కాంబో మూవీ టైటిల్‌ ను ఈ సంక్రాంతికి రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించిన రిలీజ్ అప్డేట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా యొక్క షూటింగ్ సగానికి పైగా పూర్తి చేయడం జరిగిందట. దాంతో సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.

మొదట ఈ సినిమాను దసరా కి విడుదల చేయాలని భావించినా కూడా అంతకు ముందే విడుదల అయ్యే విధంగా దర్శకుడు షూటింగ్ ను ముగించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే సినిమా మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మే నెలలో ఒక మంచి వారంలో ఈ సినిమా విడుదల చేస్తారట.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ ఎక్కువ ఇవ్వకుండా దర్శకుడు బాబీ సైలెంట్‌ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే సంక్రాంతికి లేదా ఆ తర్వాత ఏదైనా మంచి సందర్భంలో సినిమా యొక్క అన్ని అప్‌డేట్స్ ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్‌ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని డబుల్‌ హ్యాట్రిక్ ని దక్కించుకోవాలని భావిస్తున్నాడు. మరి బాబీ ఆ డబుల్‌ హ్యాట్రిక్ ను నందమూరి ఫ్యాన్స్ కి ఇచ్చేనా చూడాలి.