Begin typing your search above and press return to search.

బాలయ్య 'జైలర్‌' లుక్‌ కి మతి పోవడం ఖాయం..!

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   22 Jan 2024 1:30 PM GMT
బాలయ్య జైలర్‌ లుక్‌ కి మతి పోవడం ఖాయం..!
X

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మొన్న సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది.

సినిమా గురించిన విషయాలు మాత్రం అంచనాలు భారీగా పెంచుతున్నాయి. బాలయ్యను దర్శకుడు బాబీ రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాడట. మొదటి పాత్ర లో రెగ్యులర్‌ లుక్ లో కనిపించబోతున్న బాలయ్య రెండో పాత్రలో మాత్రం ఆరు పదుల వయసు దాటిన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం అందుతోంది.

గత ఏడాది సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ జైలర్‌ సినిమాలో ఆరు పదుల వయసు దాటిన పాత్రలో కనిపించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ పాత్రలో కూడా సూపర్‌ స్టార్‌ వావ్‌ అనిపించాడు. అచ్చు అలాగే బాలయ్య కూడా ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో సర్‌ప్రైజింగ్ లుక్‌ తో కనిపించబోతున్నాడని యూనిట్‌ సభ్యులు ఆఫ్ ది రికార్డ్‌ చెబుతున్నారు.

ఓల్డ్‌ గెటప్ లో బాలయ్య కనిపించేది కొద్ది సమయం అయినా కూడా అంతా కూడా అబ్బుర పడే విధంగా సన్నివేశాలు ఉంటాయి అంటున్నారు. మొత్తానికి బాలయ్య జైలర్‌ లుక్‌ తో సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం అన్నట్లుగా కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసిన బాలయ్య ఎన్నికల ముందే సినిమా ను తీసుకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది సాధ్యమేనా కాదా అనేది తెలియాలంటే మరి కొన్ని వారాలు ఆగాల్సిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.