Begin typing your search above and press return to search.

బాలయ్య మూవీ... బాబోయ్‌ ఇన్ని తట్టుకోగలమా?

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   15 April 2024 9:28 AM GMT
బాలయ్య మూవీ... బాబోయ్‌ ఇన్ని తట్టుకోగలమా?
X

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ మసాలా ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు.

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాలో డబుల్‌ రోల్‌ కనుక మరో హీరోయిన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్‌ కు చెందిన ఒక యంగ్‌ హీరో ఈ సినిమాలో కీలకమైన నెగటివ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ పాత్రకు తమ్ముడి పాత్రలో సదరు యంగ్‌ హీరో కనిపించబోతున్నాడని యూనిట్‌ సభ్యుల ద్వారా ఆఫ్‌ ది రికార్డ్‌ సమాచారం అందుతోంది. ఇప్పటికే చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసిన బాబీ ఇప్పుడు యంగ్ హీరో అంటున్నాడు. దాంతో ఇన్ని సర్ ప్రైజ్ లను తట్టుకోగలమా బాబీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

బాలయ్య బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బాబీ సినిమాతో బాలయ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య ఎన్నికల హడావుడి తో ఉన్నాడు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన నియోజక వర్గంలోనే కాకుండా ఆయన పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి కోసం కూడా ప్రచారం చేస్తున్నాడు. కనుక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు.

ఎన్నికల తర్వాత బల్క్‌ డేట్స్‌ ఇచ్చి సినిమాను పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా దసరా దీపావళి మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయట. బాలయ్య ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంలో ఇప్పటికే దర్శకుడు బాబీ ఒక స్పష్టత ఇచ్చాడు.