Begin typing your search above and press return to search.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి బాలయ్య.. ఇండియాలోనే తొలి నటుడిగా రికార్డు!

అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న బాలయ్యకు ఇప్పుడు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 Aug 2025 11:03 PM IST
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి బాలయ్య.. ఇండియాలోనే తొలి నటుడిగా రికార్డు!
X

టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (గోల్డ్‌ ఎడిషన్‌)లో చోటు సంపాదించుకున్నారు. తద్వారా ప్రత్యేకమైన మరో ఘనత ఆయన ఖాతాలో చేరింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ పురస్కారానికి సెలెక్ట్ అయిన తొలి నటుడిగా నిలిచారు.

బాలయ్య రీసెంట్ గా 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా హీరోగా కొనసాగుతున్నారు. పలు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల స్మారకమైన కెరీర్‌ కు గుర్తింపుగా బాలయ్యను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కరించింది. గోల్డ్ ఎడిషన్‌ లో వారసత్వాన్ని అమరత్వం చేసింది.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో సంతోష్ శుక్లా అధికారికంగా బాలయ్యకు ఇన్క్లూజన్ లెటర్ జారీ చేశారు. లక్షలాది మందికి ప్రేరణగా నిలిచిన బాలకృష్ణ ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రశంసించారు. అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ పేరును తాజాగా చేర్చడం ద్వారా WBR తమ లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది.

అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న బాలయ్యకు ఇప్పుడు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రియులు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. శభాష్ అంటూ కొనియాడుతున్నారు. ఆగస్టు 30న హైదరాబాద్ లో సత్కారం జరగనుంది.

కాగా.. సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇటీవల బాలయ్య దాన్ని స్వీకరించారు. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేసిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో టాలీవుడ్‌ నుంచి బెస్ట్ మూవీ అవార్డుకు బాలకృష్ణ భగవంత్‌ కేసరి ఎంపికైంది.

ఇప్పుడు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో ఆయనకు చోటు దక్కడంపై ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే 1974లో తాతమ్మ కల మూవీతో బాలకృష్ణ సినీ జీవితం మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటి వరకు అన్ని జోనర్స్ లో ఎన్నో సినిమాలు చేశారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌ సహా ఎన్ని ఉన్నాయో అన్నింటినీ కూడా టచ్ చేశారు. ఇప్పుడు యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతున్నారు.