బాలయ్య VS పవన్ వెంటాడుతోన్న ప్లాప్ సెంటిమెంట్!
సెప్టెంబర్ 25న రెండు పెద్ద పులులు తలపడబోతున్నాయి. రెండింటిలో ఎవరి పంజా పవర్ ఎంత? అన్నది తేలబోతుంది.
By: Tupaki Desk | 11 Jun 2025 6:00 AM ISTసెప్టెంబర్ 25న రెండు పెద్ద పులులు తలపడబోతున్నాయి. రెండింటిలో ఎవరి పంజా పవర్ ఎంత? అన్నది తేలబోతుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఇలాంటి సన్నివేశం తలెత్తడం విశేషం. అదీ రాజకీయంగా మిత్రు లైన తర్వాత పోరులోకి దిగడం అన్నది ఇదే తొలిసారి. ఆ పులులు రెండింటి గురించి ప్రత్యేకంగా పరిచ యం అవసరం లేదు. వాళ్లే నటసింహ బాలకృష్ణ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలయ్య నటిస్తోన్న `అఖండ 2` సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
సరిగ్గా అదే తేదీకి పవన్ కళ్యాణ్ నటిస్లోన్న `ఓజీ` కూడా రిలీజ్ అవుతుంది. వాస్తవానికి ఓజీ ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ జాప్యం కారణంగా వీలు పడలేదు. దీంతో పవన్ వెళ్లి బాలయ్య ముందే ఫిక్స్ చేసు కున్న రిలీజ్ తేదీపై పడ్డారు. దీంతో ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వద్ద టప్ ఫైట్ తప్పదు. నువ్వా? నేనా? అన్న రేంజ్ లో వార్ సాగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. దీంతో ఎవరిలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందన్నది ఆసక్తికరం.
బాలయ్య-పవన్ తలపడటం తొలిసారి కాదు. మొదటి సారి ఇద్దరు 2006లో పోటీకి దిగారు. బాలయ్య నటించిన `వీరభద్రం`..పవన్ నటించిన `బంగారం` ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రెండు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. అటుపై 12 ఏళ్ల తర్వాత పవన్ నటించిన `అజ్ఞాతవాసి`-బాలయ్య నటించిన `జైసింహ` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. ఆ రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి.
ఆ తర్వాత ఒకరికొకరు ఎదురు పడలేదు. మళ్లీ ఏడేళ్ల తర్వాత పోటీ బరిలో నిలిచారు. దీంతో ఆ చిత్రాల ప్లాప్ సెంటిమెంట్ కొంత వరకూ ఇద్దర్నీ వెంటాడుతుంది. మరి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తారా? అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తారా? అన్నది చూడాలి.