బాలయ్యను ఒప్పించిన ఒకే ఒక్కడు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ మధ్య యంగ్ డైరెక్టర్లతో వర్క్ చేయడం మొదలు పెట్టారు. గతంలో 40 ఏళ్లు పైబడిన డైరెక్టర్లతో మాత్రమే వర్క్ చేస్తూ వచ్చిన రజనీ ఇప్పుడు పంథా మార్చుకున్నారు.
By: Ravindar Gorantla | 4 March 2026 8:00 PM ISTసూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ మధ్య యంగ్ డైరెక్టర్లతో వర్క్ చేయడం మొదలు పెట్టారు. గతంలో 40 ఏళ్లు పైబడిన డైరెక్టర్లతో మాత్రమే వర్క్ చేస్తూ వచ్చిన రజనీ ఇప్పుడు పంథా మార్చుకున్నారు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లకే ప్రాధాన్యత నిస్తూ సినిమాలు చేస్తున్నారు. 35, 36 ఏళ్ల ఏజ్ ఉన్న యంగ్ డైరెక్టర్లతో ప్రస్తుతం సూపర్ స్టార్ సినిమాలు చేస్తున్నారు. ఇదే ఫార్ములాని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. బాబి కొల్లితో చేస్తున్న యాక్షన్ డ్రామా తరువాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు చిరు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే.
ఈ జాబితాలోకి బాలయ్య కూడా..
ఇప్పుడు ఈ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ కూడా చేరుతున్నాడు. గత కొంత కాలంగా నలభై ఏళ్లు పైబడిన డైరెక్టర్లతో మాత్రమే వర్క్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. మారిన ట్రెండ్‌కు అనుగునంగా బాలయ్య యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అలా బాలయ్యని తనదైన మార్కు స్టోరీతో ఒప్పించిన ఒకే ఒక్కడు వివేక్ ఆత్రేయ. సీనియర్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న బాలయ్యని సరికొత్త కథతో వివేక్ ఆత్రేయ ఒప్పించాడట. ఇటీవల నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ `సరిపోదా శనివారం`.
సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి రూ.100 కోట్లకు పైనే రాబట్టింది. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ రైటింగ్ స్కిల్‌ని, స్క్రీన్‌ప్లేలో తను చేసిన జిమ్మిక్కుల్ని ప్రశంసించేలా చేసింది. ఈ మూవీ తరువాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న వివేక్ ఆత్రేయ ఈసారి ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణతో భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పటికే ఆయనకు స్టోరీ నెరేట్ చేసిన వివేక్ ఈ ప్రాజెక్ట్ విషయంలో బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేశాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతోంది.
లార్జర్ దెన్ లైఫ్ స్కేల్‌లో...
`సరిపోదా శనివారం`లో లైట్ హార్టెడ్ యాక్షన్ ని చూపించిన వివేక్ ఆత్రేయ..బాలయ్యతో చేయబోతున్న మూవీతో మాత్రం ఓ రేంజ్‌లో యాక్షన్ బ్లాక్స్‌ని ప్లాన్ చేసి అందరిని షాక్‌కు గురి చేయబోతున్నాడట. స్టోరీ డిమాండ్ మేరకు ఈ మూవీ కోసం మాసీవ్‌గా భారీ స్థాయిలో బడ్జెట్‌ని కేటాయించబోతున్నారట. అంతే కాకుండా భారీ స్థాయిలో లార్జర్ దెన్ లైఫ్ స్కేల్‌లో ఈ ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అంతే కాకుండా దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలా? లేక వన్ పార్ట్‌తోనే ఎండ్ చేయాలా? అనే చర్చలు జరుగుతన్నట్టుగా తెలిసింది.
వచ్చే ఏడాది ఈమూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్, డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య నటించనున్న 112వ ప్రాజెక్ట్ ఇది. దీనికి ముందు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న మూవీలో నటిస్తున్నారు బాలయ్య. ముందు దీన్ని పీరియాడిక్ డ్రామా స్టోరీతో హై రేంజ్‌లో చేయాలని ప్లాన్ చేశారు. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఇప్పుడు యాక్షన్ స్టోరీని ఎంచుకుని చేస్తున్నారు. ఇదిలా ఉంటే వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో నటించే హీరోయిన్, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
