బాలయ్య విజిట్‌తో సంబరాల ఏటి గట్టు పై అంచనాలు డబుల్!
షూటింగ్ స్పాట్‌కు చేరుకున్న బాలకృష్ణ ముందుగా హీరో సాయి దుర్గ తేజ్‌ను ఆప్యాయంగా పలకరించి కొంతసేపు ముచ్చటించారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 July 2026 6:00 PM ISTసినిమా షూటింగ్ సెట్స్‌కు స్టార్ హీరోలు లేదా సినీ ప్రముఖులు వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ ప్రేక్షకుల్లో విశ్వాసం కలిగించే వ్యక్తి స్వయంగా ఒక సినిమా యూనిట్‌ను పలకరించి, వారి కృషిని మెచ్చుకోవడం మాత్రం ఆ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన బలాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడదే పరిస్థితి సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు విషయంలో కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ఆకస్మికంగా షూటింగ్ లొకేషన్‌ను సందర్శించడం ఒక్క యూనిట్‌కే కాదు, సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై చర్చను మరింత వేగవంతం చేసింది.
షూటింగ్ స్పాట్‌కు చేరుకున్న బాలకృష్ణ ముందుగా హీరో సాయి దుర్గ తేజ్‌ను ఆప్యాయంగా పలకరించి కొంతసేపు ముచ్చటించారు. తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెక్నికల్ టీమ్ తో మాట్లాడి సినిమా పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. చిత్ర నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో పని జరుగుతున్న తీరును ఆయన అభినందించినట్లు సమాచారం. ముఖ్యంగా సెట్స్ రూపకల్పన, ప్రొడక్షన్ వాల్యూస్, యూనిట్ చూపిస్తున్న డెడికేషన్ ఆయనను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ నటుడిగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తిగా బాలయ్య ఈ సందర్శనలో వ్యవహరించిన తీరు యూనిట్ సభ్యులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. మంచి సినిమాలు రూపొందాలంటే ఇలాంటి నిబద్ధత అవసరమని, ఇదే కమిట్‌మెంట్‌తో ముందుకు సాగితే ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆయన ప్రోత్సహించినట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేయడం కూడా వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
ఈ విజిట్‌కు సోషల్ మీడియా రెస్పాన్స్ కూడా విశేషంగా మారింది. బాలకృష్ణ యూనిట్ సభ్యులతో కలిసిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అవి వేగంగా వైరలయ్యాయి. ఫ్యాన్స్ ఈ కలయికను ప్రత్యేకంగా స్వాగతిస్తుండగా, సంబరాల ఏటి గట్టుపై సోషల్ మీడియాలో డిస్కషన్ కూడా ఊపందుకుంది. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలకు బాలయ్య విజిట్ మరో స్ట్రాంగ్ ప్రమోషన్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే భారీ నిర్మాణ విలువలు, గ్రాండ్ కాన్వాస్, సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు బాలకృష్ణ వంటి స్టార్ హీరో సెట్స్‌కు వెళ్లి యూనిట్ పనితీరును మెచ్చుకోవడం, టీమ్‌కు తన ఆశీర్వాదం అందించడం పరిశ్రమలో సానుకూల సంకేతంగా మారింది. దీంతో సంబరాల ఏటి గట్టుపై ఆడియన్స్ పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి మరింత పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు.
