Begin typing your search above and press return to search.

బాలయ్య కామెంట్స్ చిరు కోసమా? లేక ఫ్లోలో మట్లాడేశారా?

రీసెంట్ గా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం అందుకోగా.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గ ప్రజలు సన్మాన సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 May 2025 1:38 PM IST
బాలయ్య కామెంట్స్ చిరు కోసమా? లేక ఫ్లోలో మట్లాడేశారా?
X

సీనియర్ నటుడు, టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ.. స్పీచ్ ల రూటే వేరు. వేదికపై మైక్ పట్టుకుంటే చాలు.. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుకుంటూ పోతారు. తర్వాత ఏం జరుగుతుందోనన్న విషయం పక్కనపెడితే.. తన మనసులోని భావాలన్నింటినీ బయటపెడుతుంటారు. ఇలా తరచూ జరుగుతున్న సంగతి విదితమే.

రీసెంట్ గా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం అందుకోగా.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గ ప్రజలు సన్మాన సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వైట్ కలర్ షెర్వానీతో వచ్చిన బాలయ్య.. 50 ఏళ్లపాటు హీరోగా కొనసాగిన వ్యక్తి మరొకరు లేరని తెలిపారు. తనను చూసి తనకు పొగరని వ్యాఖ్యానించారు నటసింహం.

ఆ తర్వాత నటులు ఎమ్మెల్యేలుగా మారడం ఎల్లప్పుడూ విజయవంతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదని అన్నారు. హిందూపురంలో తాను పనులు చేశానని, అందుకే తనను గెలిపించుకున్నారని చెప్పారు. ఎన్ టీ రామారావు కొడుకును అయినంత మాత్రాన తాను ఎన్నిక కాలేదని చెప్పారు.

చాలా మంది సినిమా నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి జాడ లేకుండా పోయారని, అడ్రస్ లేకుండా పోయారని అని బాలయ్య వ్యాఖ్యానించారు. సమాజంలో తమవంతు బాధ్యత ఉండాలని అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. బాలయ్య ఎవరిని ఉద్దేశించి మాట్లాడారోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే బాలయ్య కామెంట్స్ విన్నాక.. ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి అనే చెప్పాలి. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన పార్టీకి కొన్ని సీట్లు దక్కేలా చేశారు. కానీ కొంతకాలానికి పార్టీని విలీనం చేశారు. అలా రాజకీయాల్లో ఇన్ యాక్టివ్ గా మారారు.

అలా అని చిరంజీవినే బాలయ్య టార్గెట్ చేశారని చెప్పలేం. ఎందుకంటే టీడీపీ, జనసేన పార్టీలు ఒకే కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. చిరు తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన.. కూటమిలో ఉండడంతో మెగాస్టార్ ఫ్యామిలీతో నందమూరి ఫ్యామిలీ పొత్తు పెట్టుకున్నట్లే. కాబట్టి చిరును ఉద్దేశించే బాలయ్య అన్నారని నమ్మలేం.

అయితే చిరంజీవి కాకుండా కైకాల సత్యనారాయణ, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, శారద, జమున వంటి చాలా మంది రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీంతో వాళ్లను ఉద్దేశించి మాట్లాడారేమోనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నటులను లక్ష్యంగా చేసుకోవచ్చని కూడా అంటున్నారు.

ఏదేమైనా బాలయ్య స్పీచ్.. ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ, అంతా మాత్రం తెగ మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి కోసం కాదని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య ఉద్దేశమేంటో.. క్యాజువల్ గా అలా ఫ్లోలో మాట్లాడారో.. లేక ఏం జరిగిందో ఆయనకే తెలియాలి.