బాలయ్యతో నంబర్ వన్ కోసం స్టార్ డైరెక్టర్ల రేసు!
ఈ రేసులో ఇప్పటికే అధికారికంగా కొరటాల శివ లాక్ అయ్యారు. `దాదా` పూర్తయిన అనంతరం కొరటాల సినిమా సెట్స్ కు వెళ్తుంది.
By: Tupaki Desk | 30 Oct 2026 8:00 PM ISTనటసింహ బాలకృష్ణ జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించలేదు. వయసుతో సంబంధం లేకుండా వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న బాలయ్య లైనప్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనది దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న `దాదా` సినిమా షూటింగ్‌తో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై అటు ఇండస్ట్రీలో.. ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
`దాదా` సినిమా సెట్స్‌పై ఉండగానే బాలయ్య తదుపరి సినిమాల కోసం స్టార్ దర్శకులందరూ క్యూ కట్టడం విశేషం. ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్లు బాలయ్యను కలిసి కథలు వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో `దాదా` తర్వాత నటసింహం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనే అంశంలో ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. బాలయ్యతో సినిమా చేయడానికి పోటీపడుతున్న ఆ దర్శకుల సీనియారిటీ .. ప్రాధాన్యత క్రమం ఎలా ఉండొచ్చనే? చర్చ జోరుగా సాగుతోంది.
ఈ రేసులో ఇప్పటికే అధికారికంగా కొరటాల శివ లాక్ అయ్యారు. `దాదా` పూర్తయిన అనంతరం కొరటాల సినిమా సెట్స్ కు వెళ్తుంది. అనంతరం బాలయ్య డైరెక్టర్ ఆర్డర్ చూస్తే..`భగవంత్ కేసరి` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్యతో మరో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ఇప్పటికే పర్ఫెక్ట్ కమర్షియల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి వినిపించినట్లు సమాచారం. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పక్కా ఎంటర్టైన్మెంట్.. యాక్షన్ మిక్స్ చేసిన కథ కావడంతో బాలయ్య మొగ్గు ఈ కాంబినేషన్ వైపే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వినిపిస్తోంది.
రెండో స్థానంలో విజయ్ కనకమేడల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలకృష్ణతో ఓ పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చేయడానికి కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. మూడో స్థానంలో క్లాసిక్ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు బలంగా వినిపిస్తోంది. బాలయ్యతో శివ ఓ క్లాసిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసాడనే చర్చ జోరుగా సాగుతోంది. నాల్గవ స్థానంలో బాలయ్యా ఆ స్థాన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది.
ఐదవ స్థానంలో పూరి జగన్నాథ్ .. బాబీ లాంటి దర్శకులు కూడా బాలయ్యను ఇంప్రెస్ చేసేందుకు పోటీ పడుతున్నారు. మరి ఈ క్రేజీ లైనప్‌లో బాలయ్య ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే `దాదా` బాయల్య కు 111వ చిత్రం అవుతుంది. కొరటాల ప్రాజెక్ట్ 112 అవుతుంది. అనంతరం నెంబర్ల రేసులో ఎవరుంటారు? అన్నది చూడాలి.
