Begin typing your search above and press return to search.

బాలయ్యతో ఈసారి పాన్ ఇండియా మాస్ బొమ్మ..?

గోపీచంద్ సినిమా మాత్రం క్లిక్ అయితే బాలీవుడ్ లో కూడా బాలయ్యకి మంచి మాస్ ఫ్యాన్ బేస్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 5:00 AM IST
బాలయ్యతో ఈసారి పాన్ ఇండియా మాస్ బొమ్మ..?
X

టాలీవుడ్ లో మాస్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అంటే అది నందమూరి నట సింహం బాలకృష్ణ మాత్రమే. తొడకొట్టి బాక్సాఫీస్ ని షేక్ చేసిన రికార్డుల హిస్టరీ ఆయన సొంతం. అలాంటి బాలయ్య ఈమధ్య కొన్ని వెరైటీ కథలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. టాక్ షో హోస్ట్ గా చేసి తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపిస్తూ అలరిస్తున్నారు. బాలకృష్ణ లో ఈ ఫన్ యాంగిల్ ని చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా సూపర్ అనేస్తున్నారు. అన్ స్టాపబుల్ గా బాలయ్య ఇదే ఫాం కొనసాగించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారు. ఆల్రెడీ గోపీతో వీర సింహా రెడ్డి సినిమా తీసి హిట్ కొట్టారు బాలయ్య. ఐతే ఈసారి మాస్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. ఈమధ్యనే సన్నీ డియోల్ తో జాత్ అనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని.

బాలీవుడ్ లో సన్నీని మాస్ ఎలివేషన్స్ లో చూపించి ఔరా అనిపించాడు గోపీచంద్. అందుకే బాలీవుడ్ ఆడియన్స్ కూడా గోపీచంద్ నెక్స్ట్ సినిమా మీద ఒక కన్నేసి ఉంచారు. బాలయ్యతో గోపీచంద్ చేసే సినిమా కూడా పాన్ ఇండియా అప్పీల్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. బాలకృష్ణ నేషనల్ లెవెల్ లో మాస్ సినిమా తీస్తే ఆ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఎలాగు జాత్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి గోపీచంద్ పరిచయమయ్యాడు కాబట్టి అతని డైరెక్షన్ లో వస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ కి మంచి హై వస్తుంది.

అఖండ 2 ని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో బాలయ్య కూడా మిగతా స్టార్స్ లా తన పాన్ ఇండియా ప్లానింగ్ లో ఉన్నారనిపిస్తుంది. గోపీచంద్ సినిమా మాత్రం క్లిక్ అయితే బాలీవుడ్ లో కూడా బాలయ్యకి మంచి మాస్ ఫ్యాన్ బేస్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. మరి గోపీచంద్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఆ సినిమా ఎప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది అన్నది వేచి చూడాలి.