బాలయ్య నెం.1 దక్కించుకున్నాడు..!
ఇటీవలే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషన్ అవార్డును అందుకున్న బాలకృష్ణ వార్తల్లో నిలిచారు.
By: Tupaki Desk | 1 May 2025 4:01 AMనందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్‌ను దక్కించుకున్న బాలకృష్ణ రాజకీయాల్లోనూ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇక సీనియర్ హీరోలు వరుసగా మూడు, నాలుగు హిట్‌లు దక్కించుకోవడం కూడా ఈమధ్య కాలంలో సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమయంలో బాలకృష్ణ నాలుగు సినిమాలు సక్సెస్ కావడంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇటీవలే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషన్ అవార్డును అందుకున్న బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూ, ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ సమయం లేకుండా ఉండే బాలకృష్ణ తాజాగా ఖైరతాబాద్ ఆర్‌టీవో కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం బాలకృష్ణ స్వయంగా ఆర్‌టీవో కార్యాలయానికి వెళ్లారని తెలుస్తోంది. ఆయనకు అధికారులు స్వాగతం పలికి కొత్త కారు రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేశారు. ఆయన సంతకం తీసుకుని, ఫోటో తీసుకున్న అధికారులు ఆయనకు TG09F0001 అనే నెంబర్‌ను అలార్ట్ చేశారు. ఈ నెంబర్ కోసం బాలకృష్ణ అదనంగా రుసుము చెల్లించారని తెలుస్తోంది.
తన కారుకు నెం.1 కావాలనే ఉద్దేశంతో ఆగి మరీ బాలకృష్ణ ఈ నెంబర్‌ను తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వేలం పాటలో ఆ నెంబర్‌ను బాలకృష్ణ దక్కించుకున్నాడని సమాచారం అందుతోంది. వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత కూడా కొద్ది సమయం బాలకృష్ణ ఆఫీస్‌లోనే ఉన్నారు. అధికారులతో మాట్లాడుతూ పలు విషయాల గురించి వారిని సమాచారం అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఇటీవలే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఖైరతాబాద్ ఆర్‌టీవో ఆఫీస్‌కి వెళ్లి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందిన విషయం తెల్సిందే. సినిమా తారలు అంతా కూడా ఖైరతాబాద్‌లోనే తమ వాహనాలను రిజిస్ట్రర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్‌కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా సగానికి పైగా పూర్తి అయిందని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే కీలకమైన షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేయబోతున్నాడు దర్శకుడు బోయపాటి. హిమాలయాల్లో రూపొందించిన కొన్ని షాట్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. అంతే కాకుండా సినిమాలో వచ్చే మహా కుంభమేళ విజువల్స్ కూడా కంటికి ఇంపుగా ఉంటాయని, బాలకృష్ణ అభిమానులకు కాలర్ ఎగరేసుకునే విధంగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాకు తమన్ అందిస్తున్న సంగీతం మరోసారి సినిమాను హిట్ చేయడం ఖాయం అనే ధీమా వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది చివరి వరకు అఖండ 2 సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.