NBK111 కోసం ఇద్దరు ప్రముఖ నటులు
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సక్సెస్‌లతో కెరీర్లో దూసుకెళ్తున్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 11:44 AM ISTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సక్సెస్‌లతో కెరీర్లో దూసుకెళ్తున్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అఖండ2 తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరూ కలిసి గతంలో వీరసింహా రెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా ఆడియన్స్ నుంచి మంచి టాక్ ను తెచ్చుకోవడంతో పాటూ బాక్సాఫీస్ వద్ద కూడా బాగా కలెక్ట్ చేసి నిర్మాతలకు లాభాలను అందించింది. వీర సింహారెడ్డి సినిమా చేస్తున్న టైమ్ లోనే బాలయ్య, గోపీచంద్ తో మరో సినిమా కూడా చేస్తానని మాటిచ్చారు.
ఆ మాట ప్రకారమే గోపీచంద్ తో ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. బాలకృష్ణ కెరీర్లో 111వ సినిమాగా తెరకెక్కనున్న ఆ మూవీ గురించి రీసెంట్ గా నాట్స్ లో గోపీచంద్ మాట్లాడుతూ ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని కొత్త యాంగిల్ లో చూపిస్తానని చెప్పి సినిమాపై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ మంచి హైప్ తో తెరకెక్కబోయే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించడానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇద్దరు ప్రముఖ నటులతో డిస్కషన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆ నటులెవరనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే గోపీచంద్ ఈసారి వీర సింహారెడ్డిని మించిన సినిమాను బాలయ్యతో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
