Begin typing your search above and press return to search.

బాలయ్య సింగిల్ సిట్టింగ్ జడ్జిమెంట్..!

మిగతా హీరోలు డైరెక్టర్ చెప్పిన కథలో అది బాలేదు ఇది బాలేదని అంటారేమో కానీ బాలకృష్ణ కోసం ఏదైనా డైరెక్టర్ కథ పట్టుకొస్తే 99 శాతం ఆ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది.

By:  Tupaki Desk   |   7 May 2025 2:45 AM
బాలయ్య సింగిల్ సిట్టింగ్ జడ్జిమెంట్..!
X

సీనియర్ హీరోల్లో బాలకృష్ణ చూపిస్తున్న దూకుడు మరే హీరో చూపించట్లేదు. ఏడాదికి ఒకటి కంపల్సరీ కుదిరితే రెండోది కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఓ పక్క పాలిటిక్స్ లో ఉంటూ హీరోగా బిజీ బిజీగా ఉన్నారు బాలయ్య. ప్రస్తుతం అఖండ 2 సినిమా పూర్తి చేసే పనుల్లో ఉన్న ఆయన నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు. మిగతా హీరోలు డైరెక్టర్ చెప్పిన కథలో అది బాలేదు ఇది బాలేదని అంటారేమో కానీ బాలకృష్ణ కోసం ఏదైనా డైరెక్టర్ కథ పట్టుకొస్తే 99 శాతం ఆ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది.

ముఖ్యంగా రైటర్స్, డైరెక్టర్స్ ఒక స్టోరీ చెబితే దాని మీద సవాలక్ష డౌట్లు.. ఇంకా వర్క్ చేయమని చెప్పడం ఇలాంటివి బాలకృష్ణ దగ్గర ఉండదు. కథ విన్నామా నచ్చిందా సింగిల్ సిట్టింగ్ లో డైరెక్టర్ కి ఓకే చెప్పేసి నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేస్తాడు. బాలయ్య ఈమధ్య వరుస సూపర్ హిట్లు కొడుతున్నారు. దానికి కారణం ఆయన ఇమేజ్ కి తగిన కథలను ఓకే చేయడమే.

ఇప్పటికీ సీనియర్ హీరోలు కథల విషయంలో రోజులకు రోజులు టైం పాస్ చేస్తుంటే బాలకృష్ణ మాత్రం తన దాకా వచ్చిన కథకు మాక్సిమం గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అందుకే కథల విషయంలో బాలయ్య బాబు జడ్జిమెంట్ ని సూపర్ అనేస్తుంటారు ఫ్యాన్స్. అంతేకాదు కథ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ హిట్ ఫాం లో ఉన్నాడా లేదా ఫెయిల్యూర్స్ చేస్తున్నాడా అన్నది కూడా బాలకృష్ణ అసలు పట్టించుకోరు.

అఖండ 2 పూర్తి అవ్వడమే ఆలస్యం గోపీచంద్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు బాలకృష్ణ. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి వీర సింహా రెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బాలయ్యతో మరో ఊర మాస్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు డైరెక్టర్ గోపీచంద్. ఇక హరీష్ శంకర్ తో కూడా బాలయ్య సినిమా ఒకటి డిస్కషన్స్ లో ఉంది. హరీష్ శంకర్ మార్క్ సినిమాలో బాలకృష్ణ నటిస్తే ఫ్యాన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది.. దాని విషయాలేంటి అన్నది త్వరలో తెలుస్తుంది.