Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ కోసం గెస్ట్‌గా బాలయ్య?

జైలర్‌ సినిమాలో అతిథులుగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   30 April 2025 9:52 AM
Balakrishna In Jailer 2 Guest Role
X

తమిళ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా 'జైలర్‌'. రజనీకాంత్‌ కెరీర్‌ ఖతం అనుకున్న సమయంలో వచ్చిన జైలర్‌ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. రజనీకాంత్‌ సినిమా మంచి కంటెంట్‌ వస్తే ఎలా ఉంటుందో జైలర్ నిరూపించింది. జైలర్‌ సినిమా తర్వాత రజనీకాంత్‌ గేర్ మార్చారు. వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ, తన నుంచి అభిమానులు కోరుకునే పాత్రలను చేస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. జైలర్‌ సినిమా సూపర్ హిట్‌ కావడంతో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ అప్పుడే సీక్వెల్‌ను గురించి అధికారికంగా ప్రకటించాడు.

జైలర్‌ సినిమాలో అతిథులుగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన విషయం తెల్సిందే. జైలర్‌ 2 లో వారు ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ విషయమై క్లారిటీ రాకుండానే టాలీవుడ్‌ స్టార్‌ బాలకృష్ణ 'జైలర్‌ 2' సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. సినిమా కథలో భాగంగానే ఒక తెలుగు వ్యక్తి రజనీకాంత్‌కి హెల్ప్‌ చేస్తాడట. ఆ తెలుగు వ్యక్తి బాలకృష్ణ అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. జైలర్‌ సినిమాలో ఇద్దరు సూపర్‌ స్టార్స్ నటించడం వల్ల అంచనాలు పెరిగాయి, అంతే కాకుండా సినిమాను చూస్తున్న సమయంలో ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యారు.

ఆ థ్రిల్‌ను సీక్వెల్‌ను కంటిన్యూ చేసే ఉద్దేశంతో గెస్ట్‌ అప్పియరెన్స్‌ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. జైలర్‌ 2 సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించడం అనేది దాదాపుగా ఖాయం అని సమాచారం అందుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ ఇప్పటికే బాలకృష్ణ డేట్లు అడిగాడు. త్వరలోనే ఆయన హైదరాబాద్‌ వచ్చి మరీ బాలకృష్ణకు స్టోరీ లైన్ ఇతర విషయాల గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ రెండు మూడు రోజులు జైలర్ 2 షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వారాల క్రితం జైలర్‌ 2 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.

బాలకృష్ణ వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొంటాడేమో చూడాలి. బాలకృష్ణ, రజనీకాంత్‌ కాంబో సీన్స్ ఉండక పోవచ్చు అని తెలుస్తోంది. శివ రాజ్‌ కుమార్‌ సన్నివేశాలను ఆయన నివాసంలోనే షూట్‌ చేశారని సమాచారం. బాలకృష్ణకు సంబంధించిన సన్నివేశాలను సైతం హైదరాబాద్‌లోనే షూట్‌ చేసే విధంగా ప్లాన్‌ చేస్తారని తెలుస్తోంది. జైలర్‌ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్‌ 2 సినిమాకు కూడా మంచి బజ్‌ ఉంది. కనుక జైర్ 2 లో బాలకృష్ణ ఉంటే కచ్చితంగా మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జైలర్‌ 2 కి కూడా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. జైలర్‌ 2 అనౌన్స్మెంట్‌ వీడియోకు మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే.