గోపీచంద్ బాలయ్య వీర లెవెల్ మాస్..?
నెక్స్ట్ ఈ ఇద్దరు కలిసి మరో మాస్ బొమ్మని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. బాలకృష్ణ అఖండ 2 పూర్తి అవ్వడమే ఆలస్యం నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమాకే డేట్స్ ఇవ్వనున్నాడు
By: Ramesh Boddu | 1 Aug 2025 3:58 PM ISTగోపీచంద్ మలినేని రాత్ సినిమాతో బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మాస్ ఎలివేషన్స్ కి సన్నీ డియోల్ ఫ్యాన్స్ అంతా సూపర్ ఖుషి అయ్యారు. ఐతే గోపీచంద్ నెక్స్ట్ నందమూరి నట సిం హం బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. మరోసారి గోపీచంద్ బాలయ్య కాంబో ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈసారి బాలకృష్ణ ని డిఫరెంట్ గా చూపిస్తానని గట్టిగా చెబుతున్నాడు గోపీచంద్.
నేషనల్ లెవెల్ ఆడియన్స్ మెచ్చే కథతో..
రాత్ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ కి తను పరిచమయ్యాడు గోపీచంద్. సో నెక్స్ట్ బాయ్యతో చేస్తున్న సినిమాను కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ మెచ్చే కథతో వస్తున్నాడట. ఈమధ్య మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా అలాంటి కథలనే చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి అటెంప్ట్ బాలయ్యతో చేయాలని చూస్తున్నాడు గోపీచంద్. ఆల్రెడీ వీర సింహా రెడ్డితో ఈ కాంబో రేంజ్ ఏంటో చూపించారు.
నెక్స్ట్ ఈ ఇద్దరు కలిసి మరో మాస్ బొమ్మని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. బాలకృష్ణ అఖండ 2 పూర్తి అవ్వడమే ఆలస్యం నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమాకే డేట్స్ ఇవ్వనున్నాడు. ఐతే ఈ సినిమా వీర లెవల్ మాస్ మూవీగా ఉంటుందట. తెలుగులో వస్తున్న మాస్ యాక్షన్ సినిమాలకు బీ టౌన్ లో కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. గోపీచంద్ కి ఎలాగు మాస్ పల్స్ బాగా తెలుసు. అందుకే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో చేస్తారని తెలుస్తుంది.
బాలయ్య సినిమాతో గోపీచంద్ పెద్ద స్కెచ్..
బాలయ్య అఖండ 2 ఫినిష్ చేయడమే ఆలస్యం గోపీచంద్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా తర్వాత ఆదిత్య 999 సినిమాను కూడా బాలకృష్ణ చేయనున్నారు. తప్పకుండా బాలయ్య సినిమాతో గోపీచంద్ చాలా పెద్ద స్కెచ్ వేశాడని అర్థమవుతుంది. ఇది గోపీచంద్ నుంచి వచ్చే రెగ్యులర్ మాస్ సినిమాగా కాకుండా కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్. బాలయ్య మరోసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు గోపీచంద్. ఆ సినిమా రిజల్ట్ ని బట్టి నెక్స్ట్ ఎవరన్నది డిసైడ్ చేస్తాడట. గోపీచంద్ బాలయ్య సినిమా అంటే చాలు నందమూరి ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. వారి అంచనాలకు మించి ఈ మూవీ ఉంటుందని అంటున్నారు.
