బాలయ్య కొత్త సినిమాకు ముహూర్తం పెట్టేసారా?
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని మరో సినిమాకు రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 May 2025 6:15 AMనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని మరో సినిమాకు రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `వీరసింహారెడ్డి` బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారు. దీతో `జాట్` రిలీజ్ అనంతరం గోపీచంద్ కూడా బాలయ్య సినిమా పనులు మొదలు పెట్టేసారు. అల్రెడీ ఉన్న స్టోరీల్నే బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్దం చేసారు.
తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ 8న చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారుట. అటుపై అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నారుట. గోపీచంద్ మేకింగ్ పరంగా ఎక్కువ టైమ్ తీసుకోరు. మూడు నాలుగు నెలల్లోనే చాలా వరకూ పని పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ కి మరికొంత సమయం తీసుకుంటారు.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి భారీ అంచనాల మధ్య `అఖండ2` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ లో రిలీజ్ తేదీ ప్రకటించారు . కానీ ఆ తేదీకి రిలీజ్ కష్టమని వినిపిస్తుంది. వాయిదా పడితే రిలీజ్ దసరా సందర్భంగా అక్టోబర్లోనే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ ని బట్టి బాలయ్య తదుపరి సినిమాకు డేట్లు కేటాయిస్తారు.
ప్రారంభోత్సవానికి జూన్ దాటితే మళ్లీ మంచి రోజులు లేకపోవడంతో లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఆ నెలలో చాలా సినిమాలు ప్రారంభమవుతాయి. మళ్లీ మంచి రోజులు అంటే శ్రావణ మాసం వరకూ ఎదురు చూడాలి. కానీ ఆ మాసం సినిమాలకు అనువైంది కాదు. వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీలైనన్ని సినిమాలన్నీ జూన్ లోనే లాంచ్ అవుతుంటాయి.