Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో బాల‌య్య అతిధి దేవో భ‌వ టైపు!

కానీ న‌ట‌సింహ బాల‌కృష్ణ కు అలాంటిది ఏమీ ఉండ‌దుట‌. ఇష్ట ప‌డితినే వంట‌కాలు అంటూ ఏవీలే వ‌న్నారు.

By:  Tupaki Desk   |   6 July 2025 12:00 AM IST
ఆ విష‌యంలో  బాల‌య్య అతిధి దేవో భ‌వ టైపు!
X

ప్ర‌తీ ఒక్క‌రికీ అభిమాన వంట‌కాలంటూ కొన్ని ఉంటాయి. వాటిని ఇష్టంగా తిన‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. పుడ్ విష‌యంలో సెల‌బ్రిటీలు కూడా ఎంతో ఓపెన్ గా ఉంటారు. చిరంజీవి, నాగార్జున‌, వెంకటేష్ లాంటి స్టార్లు ఇప్ప‌టికే తామంతా ఇష్టంగా ఆర‌గించే వంట‌కాల గురించి ప‌లు సంద‌ర్బాల్లో చెప్పారు. సెల‌బ్రిటీ లైఫ్ కార‌ణంగా ఎంత స్ట్రిక్ట్ డైట్ పాటించినా అప్పుడ‌ప్పుడు డైట్ ని ప‌క్క‌న‌బెట్టి అన్ని ర‌కాల వంట‌కాలు ఆర‌గిస్తుంటారు. ప్ర‌త్యేకంగా లంచ్ లోకి కొన్ని వంట‌కాలంటూ ఉండాల‌ని కోరుకుంటారు.

కానీ న‌ట‌సింహ బాల‌కృష్ణ కు అలాంటిది ఏమీ ఉండ‌దుట‌. ఇష్ట ప‌డితినే వంట‌కాలు అంటూ ఏవీ లేవ‌న్నారు. ఇంట్లో ఏది రెడీగా ఉంటే దాన్ని తినేసి వెళ్లిపోవ‌డం...అతిది దేవో భ‌వ అన్నారు. అంటే ఏం వండినా ఆ వంట‌కాల‌కు విలువ ఇచ్చి..కాదు అన‌కుండా తిన‌డం అన్న‌ది అత‌ని ఉద్దేశం. పుడ్ విషయంలో ప్యావరెట్ ఐటం అంటూ ఏదీ లేద‌న్నారు. అలాగే ఇంటిపుడ్ కంటే ఆయ‌న‌కు ప్రొడ‌క్ష‌న్ పుడ్ అంటే ఇష్ట‌మ‌ని గ‌తంలో తెలిపారు.

ఇంటి ప‌క్క‌నే షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇంటి నుంచి పుడ్ పంపిస్తా అన్నా? వ‌ద్దు అని ప్రొడ‌క్ష‌న్ పుడ్డే తింటాన‌న్నారు. ఆ పుడ్ తినే బాడీ ఇంత బ‌లంగా ఉంద‌న్నారు. మొత్తానికి బాల‌య్య కి ఆహారం విషయంలో నాన్ వెజ్ తినాల‌నే ఆస‌క్తి పెద్ద‌గా లేద‌ని తేలింది. ఇక బాల‌య్య సినిమాల సంగ‌తి చూస్తే ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ 2`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయాలని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈసినిమాతో బాల‌య్య పాన్ ఇండియా ఇమేజ్ రెట్టింపు అవుతుంద‌నే అంచనాలున్నాయి. ఈసినిమా రిలీజ్ అనంత‌రం గోపీచంద్ మ‌లినేనితో మ‌రో సినిమా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రాబోతున్న మ‌రో భారీ మాస్ చిత్రమిది.