నార్త్ మార్కెట్‌పై గురి పెట్టిన బాలయ్య
`అఖండ 2` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని బోయపాటి తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
By: Tupaki Desk | 14 May 2025 8:00 PM ISTనందమూరి బాలకృష్ణ `అఖండ` బ్లాక్ బస్టర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీతో తన సత్తా ఏంటో బాక్సాఫీస్‌కి మరో సారి రుచి చూపించిన బాలయ్య అదే స్పీడుతో వరుస విజయాల్ని సాధిస్తూ తన మార్కెట్‌ని పెంచుకుంటూ పోతున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్‌లని సొంతం చేసుకున్న బాలకృష్ణ అదే ఊపుతో `అఖండ` స్వీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఈ మూవీలో సెకండ్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారు.
`అఖండ 2` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని బోయపాటి తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ తో పాటు ఆర్టిస్ట్‌ల విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా లావిష్‌గా ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. రాకెట్ స్పీడుతో షూటింగ్‌ని పూర్తి చేస్తున్ బోయపాటి ఈ మూవీని హిందీ మార్కెట్‌లోనూ భారీ స్థాయిలో ఉత్తరాది ప్రేక్షకులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. బాలయ్య కోసం అఖండలో త్రిశూలాన్ని ఆయుధంగా వాడిన బోయపాటి ఈ సీక్వెల్ కోసం మాత్రం బాలయ్య కోసం సరికొత్త ఆయుధాన్ని డిజైన్ చేయించారు.
గధ, దానిపై త్రిశూలంని డిజైన్ చేసి ప్రత్యేక ఆయుధాన్ని బాలయ్య చేతిలో పెట్టారట. ఇది బాలయ్యకు పెద్దగా నచ్చకపోవడంతో కొంత ఇబ్బందిగా ఫీలవుతున్నారని, దీని వల్లే బాలయ్యకు, బోయపాటికి మధ్య దూరం పెకరుగుతోందనే వార్తలు ఈ మధ్య ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీతో నార్త్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్న టీమ్ అందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా కేర్‌గా చూస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
అంతే కాకుండా సినిమా ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం కోసం ఈ మూవీలోని తన పాత్రకు బాలయ్య స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేనా ప్రమోషన్స్ కోసం టీమ్ ఉత్తరాదిలో పర్యటించాలని ప్లాన్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. శివుడికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక అంశాలు ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో వాటినే ప్రధానంగా సినిమాలో చూపిస్తూ బాలీవుడ్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తున్నారట.
