బాలయ్య ప్లాన్ ఏంటి? ఫోకస్ అంతా అక్కడేనా?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో కొత్త స్టేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.
By: M Prashanth | 29 March 2026 6:00 PM ISTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో కొత్త స్టేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఒకప్పుడు కేవలం పక్కా మాస్ కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఆయన, ఇప్పుడు స్టైలిష్ యాక్షన్, కంటెంట్ బేస్డ్ స్టోరీలతో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్లకు బాలయ్య హాట్ ఫేవరెట్ గా మారారు.
అఖండ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోయారు. ఆ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించాయి. అయితే ఇటీవల విడుదలైన అఖండ 2 సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. అభిమానులను మెప్పించినప్పటికీ, వసూళ్ళ పరంగా సినిమా నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బాలయ్య తన తదుపరి సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహా రెడ్డి ఇప్పటికే సూపర్ హిట్ కావడంతో.. ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.
ఇక ఆ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య ఎవరి దర్శకత్వంలో నటించనున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అలాగే విజయ్ కనకమేడలతో కూడా బాలయ్య సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. వీరితో పాటు దర్శకులు హరీష్ శంకర్, హనీఫ్ కూడా బాలయ్యను కలిసి కథలు వినిపించినట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుల్లో ఏది కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం బాలయ్య పూర్తిగా గోపీచంద్ మలినేని సినిమాపైనే ఫోకస్ పెట్టడమేనని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులపై ఆయన దృష్టి పెట్టకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అభిమానులు మాత్రం బాలయ్య తదుపరి మూవీ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను కొనసాగించాలంటే సరైన కథ, సరైన దర్శకుడితోనే ముందుకు వెళ్లాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు టాక్. అందుకే కథల ఎంపికలో కూడా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం బాలయ్య ఫోకస్ మొత్తం గోపీచంద్ మలినేని ప్రాజెక్టుపైనే ఉంది. ఆ సినిమా దాదాపు చివరకు చేరుకున్నాక.. ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి బాలయ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎవరితో సినిమా ప్రకటిస్తారు? అన్నది తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.
