Begin typing your search above and press return to search.

జైలర్‌ కోసం బాలయ్య ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..!

తమిళ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ సినిమాల్లో 'జైలర్‌' సినిమా ఒకటి.

By:  Tupaki Desk   |   21 May 2025 10:14 AM IST
జైలర్‌ కోసం బాలయ్య ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..!
X

తమిళ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ సినిమాల్లో 'జైలర్‌' సినిమా ఒకటి. నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో వచ్చిన జైలర్‌ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన దక్కింది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని, అత్యధిక వసూళ్లు సాధించిన 'జైలర్‌' సినిమాకు ప్రస్తుతం సీక్వెల్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే. రజనీకాంత్‌, నెల్సన్ దిలీప్‌, అనిరుధ్‌ల కాంబోలో రూపొందుతున్న జైలర్‌ 2 సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. చకచకా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జైలర్‌ 2 కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్ భారీగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా మొదటి నుంచి సమాచారం అందుతోంది.

జైలర్‌ సినిమాలో రజనీకాంత్‌తో పాటు కన్నడ సూపర్ స్టార్‌ శివరాజ్ కుమార్‌ నటించాడు. సినిమాలో శివ రాజ్ కుమార్‌ స్క్రీన్‌ టైమ్ తక్కువే అయినా విపరీతమైన బజ్ క్రియేట్‌ అయింది. సినిమాలో ఆయన వచ్చే సీన్‌కి మంచి మార్కులు పడ్డాయి. కన్నడ మార్కెట్‌లో జైలర్ సినిమా విజృంభించడంలో శివరాజ్ కుమార్‌ పాత్ర కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అదే ఫార్ములాను జైలర్ 2 సినిమాకు వర్తింపజేసే విధంగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్ ప్లాన్‌ చేస్తున్నాడు. జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ నటించబోతున్నాడు అనే విషయం చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయం నిజమే అని అటు మేకర్స్ నుంచి కూడా అనధికారిక క్లారిఫికేషన్‌ వచ్చింది.

జైలర్‌ 2 సినిమాలో బాలకృష్ణ ను ఏపీ పోలీస్‌ ఆఫీసర్‌గా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ చూపించబోతున్నాడు. తమిళ సినీ, మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 లో బాలకృష్ణ స్క్రీన్‌ ప్రజెన్స్‌ 10 నుంచి 15 నిమిషాలు ఉండవచ్చట. అందుకోసం బాలకృష్ణ రెండు వారాల పాటు షూటింగ్‌లో పాల్గొంటాడు. ఏపీలోనే షూటింగ్ కార్యక్రమాలు ఉంటాయని, అందుకోసం చిత్ర యూనిట్‌ సభ్యులు మొత్తం ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌, బాలకృష్ణ కాంబో సీన్స్ ఉంటాయా? లేదా? అనే విషయమై మేకర్స్‌ సస్పెన్స్‌గా ఉంచారు. సినిమా విడుదల అయ్యే వరకు ఆ విషయాన్ని రివీల్‌ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇక బాలకృష్ణ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషించేందుకు గాను ఏకంగా రూ.22 కోట్ల పారితోషికంను డిమాండ్‌ చేశాడని తెలుస్తోంది. సినిమాకు తెలుగులో మంచి బజ్‌ క్రియేట్‌ కావడంతో పాటు, తన పాత్రతో సినిమాకి హైప్ క్రియేట్‌ కానున్న నేపథ్యంలో తన మార్కెట్‌కి తగ్గట్లుగా ఆ భారీ పారితోషికంను బాలయ్య డిమాండ్‌ చేశారట. అందుకు జైలర్‌ 2 నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, అడ్వాన్స్ చెక్‌ను సైతం బాలయ్యకు సన్‌ పిక్చర్స్ వారు అందించారనే వార్తలు వస్తున్నాయి.

10 నుంచి 15 నిమిషాల పాత్ర కోసం బాలయ్య రూ.22 కోట్లను తీసుకుంటున్నాడు అనే వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు సైతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. మరో వైపు బాలయ్య అఖండ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దసరాకు అఖండ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.