జైలర్ 2 కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్..!
అంతేకాదు జైలర్ 2 నందమూరి ఫ్యాన్స్ రిపీట్ గా చూసేలా సినిమాలో బాలకృష్ణ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట.
By: Tupaki Desk | 20 Jun 2025 10:22 AM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ ని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందించింది. జైలర్ సినిమాలో స్టార్ క్యామియోలు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. జైలర్ సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. రజినీ కూలీ తో పాటు జైలర్ 2 ని కూడా చేస్తున్నాడు. జైలర్ 2 సినిమాలో కూడా ఇతర భాషలకు సంబంధించిన స్టార్స్ క్యామియో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది.
ముఖ్యంగా తెలుగు నుంచి జైలర్ 2 కోసం బాలకృష్ణని అడగడం ఆయన ఓకే చెప్పడం జరిగింది. మామూలుగానే బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన రోరింగ్ అంతా ఒక రేంజ్ లో ఉంటుంది. బయట ఆడియన్స్ కూడా తెర మీద బాలయ్యని ఒక పవర్ హౌస్ లానే చూస్తారు. జైలర్ 2 లో కూడా నెల్సన్ బాలయ్యని అదే రేంజ్ లో చూపించబోతున్నారని తెలుస్తుంది. సినిమాలో ఆ ఒక్క ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందట.
అంతేకాదు జైలర్ 2 నందమూరి ఫ్యాన్స్ రిపీట్ గా చూసేలా సినిమాలో బాలకృష్ణ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే జైలర్ 2 సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో పాటు జైలర్ 2 లో తను చేయాల్సిన షూట్ కూడా చేస్తాడు. జైలర్ 2 లో బాలకృష్ణ పాత్ర ఏంటి ఆయన క్యామియో ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ బాలయ్యని సరిగా చూపిస్తే మాత్రం నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఆయనకు ఇచ్చినా ఇచ్చేస్తాడు బాలయ్య. మొత్తానికి జైలర్ 2 లో బాలయ్య రోల్ మీదే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ అయ్యేలా చేస్తుంది. బాలయ్య కూడా అఖండ 2, గోపీచంద్ మలినేని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ 2 ఇప్పటికే భారీ అంచనాలతో వస్తుండగా నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందని టాక్.
