అఖండ2 కోసం బోయపాటి అదిరే ప్లాన్!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jun 2025 6:02 PM ISTగాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 ను చేస్తున్నారు బాలయ్య. అఖండ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా సినిమా వస్తుండటంతో అఖండ2పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
దానికి తోడు బాలయ్య- బోయపాటి శ్రీను కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా, ఆ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయి రికార్డులు సృష్టించాయి. అఖండ2 వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా. ఇప్పటికే ఓ హ్యాట్రిక్ హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్న బాలయ్య- బోయపాటి ద్వయం ఇప్పుడు అఖండ2 తో సెకండ్ హ్యాట్రిక్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరలవుతుంది. అయితే ఇప్పుడు అఖండ2 గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అఖండ2 లో బాలయ్య కోసం బోయపాటి సూపర్బ్ ప్లాన్ వేశారని, అందులో భాగంగానే అఖండ2లో బోయపాటి ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేయిస్తున్నారని తెలుస్తోంది.
అయితే అఖండ2లో స్పెషల్ సాంగ్ పెట్టాలనే నిర్ణయమైతే తీసుకున్నారు కానీ ఆ సాంగ్ ను ఏ హీరోయిన్ తో చేయించాలనేది మాత్రం మేకర్స్ ఫిక్సవలేదట. నెక్ట్స్ షెడ్యూల్ లో ఈ స్పెషల్ సాంగ్ ను షూట్ చేసి, తర్వాత దానికి బాలయ్య షాట్స్ ను యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో బాలయ్య మరోసారి అఘోరా గెటప్ లో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. అఖండ2 సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా, బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
