బోయపాటి - బాలయ్య మధ్య క్లాష్‌కు రీజన్ అదేనా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో ఇప్పటి వరకు వరుస హిట్‌లున్నాయి. సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస హిట్‌లతో హ్యాట్రిక్ హిట్‌ని దక్కించుకున్న కాంబినేషన్ వీరిది.
By: Tupaki Desk | 13 May 2025 6:15 AMనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో ఇప్పటి వరకు వరుస హిట్‌లున్నాయి. సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస హిట్‌లతో హ్యాట్రిక్ హిట్‌ని దక్కించుకున్న కాంబినేషన్ వీరిది. అయితే వీరిద్దరు కలిసి నాలుగవసారి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ మూవీ `అఖండ`కు సీక్వెల్‌గా `అఖండ 2`ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బోయపాటితో బాలయ్య జర్నీ ప్రారంభానికి ముందు వరుస ఫ్లాపులు చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
ఇప్పుడు వరుస ఫ్లాపులతో బోయపాటి శ్రీను సతమతమవుతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే `ఎవరి మాట వినడు సీతయ్య` అనే తరహాలో బోయపాటి వ్యవహరిస్తున్నారట. తను చెప్పిందే వేదం, తను గీసిందే గీత, రాసిందే డైలాగ్, డిజైన్ చేసిందే ఆయుధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇదే బాలయ్య - బోయపాటిల మధ్య క్లాష్‌కు కారణంగా మారి వారి మధ్య దూరం పెంచుతోందనే టాక్ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
`అఖండ 2`ని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ప్రారంభించారు. టైటిల్ టీజర్‌ని కూడా హరీ బరీగా మమా అనిపించేసి విడుదల చేశారు. అక్కడి నుంచే బాలయ్య, బోయపాటి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయనే టాక్ స్టార్ట్ అయింది. సినిమా షూటింగ్ జరుగుతున్నా కొద్దీ ఆ టాక్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా బాలయ్యకు, బోయపాటికి మధ్య దూరం మరింత పెరగడానికి కారణం సినిమా కోసం ప్రత్యేకంగా బోయపాటి డిజైన్ చేయించిన ఆయుధం అని తెలుస్తోంది.
అఖండలో త్రిశూలాన్ని బాలయ్యకు ఆయుధంగా చూపించిన బోయపాటి `అఖండ 2`లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సరికొత్త ఆయుధాన్ని డిజైన్ చేయించారట. అదే గద, దానిపై త్రిశూలం. ఇది బాలయ్యకు నచ్చలేదట. ఇదెక్కడి ఆయుధం? నేను ఎక్కడా చూడలేదే అన్నారట. ఇలాగే ఉంటదని బోయపాటి సమాధానం చెప్పడంతో బాలయ్యకు అది నచ్చలేదట. అయినా సరే ఇద్దరి మధ్య క్లాష్ ఉన్నా కమిట్‌మెంట్‌తో షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూ షూటింగ్ చేస్తున్నారట.
బాలయ్యకు పురాణాలపై మంచి పట్టుంది. అలాంటి ఆయనకు పురాణాల్లో వాడిన ఆయుధాల గురించి క్షుణ్నంగా తెలుసు. ఎక్కడా ఏ పురాణంలో వాడని ఆయుధాన్ని `అఖండ 2`లో వాడటం ఎందుకు?.. అలాంటి ఆయుధం వాడాల్సిన అవసరం ఏముంది? అని బాలయ్య భావించారట. ఇదే విషయాన్ని బోయపాటికి చెబితే ఇందులో ఇలాగే ఉంటుందని చెప్పడం బాలయ్యకు నచ్చలేదని, అదే బోయపాటి - బాలయ్యల మధ్య దూరాన్ని పెంచుతోందని ఇన్ సైడ్ టాక్.