Begin typing your search above and press return to search.

బాలయ్యతో డాకు విలన్.. ఫోటో అదిందిగా..!

బాబీ డియోల్ తన క్యాజువల్ వేర్ తో కనిపించగా బాలయ్య మాత్రం జీన్స్ టీ షర్ట్ వేసుకుని కనిపించారు.

By:  Tupaki Desk   |   6 July 2025 9:47 AM IST
బాలయ్యతో డాకు విలన్.. ఫోటో అదిందిగా..!
X

ఒక సినిమాలో పనిచేసిన ఇద్దరు స్టార్స్ ఆ సినిమా పూర్తయ్యాక కూడా అదే తరహా రిలేషన్ కొనసాగిస్తారు. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య సినిమాలో పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఆ టైం లో ఇద్దరు కూడా సీన్ డిస్కషన్ ఇంకా చాలా చర్చలు చేసుకుంటారు. అలా వారి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇక కాంబినేషన్ సెట్ అయితే వాళ్లని రిపీట్ చేస్తుంటారు. ఇది మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అలా మన బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ని కలిశారు.

ఇద్దరు వారి వారి పనుల్లో సినిమాలతో బిజీగా ఉండగా అలా ఒకచోట ఎదురుపడినట్టు తెలుస్తుంది. బాబీ డియోల్ తన క్యాజువల్ వేర్ తో కనిపించగా బాలయ్య మాత్రం జీన్స్ టీ షర్ట్ వేసుకుని కనిపించారు. ఇద్దరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అలా ఎదురుపడగా అలా ఒక ఫోటోకి ఫోజు ఇచ్చారన్నమాట. బాబీ డియోల్ బాలయ్య కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్య ప్రతుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక బాబీ డియోల్ యానిమల్ తో తిరిగి ఫాంలోకి రాగా ఈసారి సౌత్ సినిమాలు ముఖ్యంగా వరుస తెలుగు సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాబీ నటిస్తున్నాడు.

యానిమల్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాబీ డియోల్ సౌత్ లో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నాడు. అటు బాలీవుడ్ లో కూడా బాబీ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఐతే తెలుగు సినిమాల్లో నటిస్తున్న బాబీ ఇక్కడ కూడా అభిమానులను ఏర్పరచుకుంటున్నాడు. బాలయ్య, బాబీ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చినా రావొచ్చు అనేలా వీరి బాండింగ్ ఉంది. బాలకృష్ణ తనతో నటించిన వారికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. సో బాబీ తో మళ్లీ మరో సినిమాలో ఢీ కొట్టే ఛాన్స్ లేకపోలేదు. అఖండ 2 తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో మరో యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో బాబీ డియోల్ ని విలన్ గా పెట్టే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి.