బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు థమన్ బయటకా?
నటసింహ బాలకృష్ణ సినిమాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్న తర్వాత ఆ స్థానం లోకి తమన్ వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 July 2025 7:00 PM ISTనటసింహ బాలకృష్ణ సినిమాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్న తర్వాత ఆ స్థానం లోకి తమన్ వచ్చిన సంగతి తెలిసిందే. దేవి శ్రీ ఎగ్జిట్ అయిన నాటి నుంచి థమన్ బాలయ్య ఆ స్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు వరుసగా మంచి విజయాలు సాధించాయి. దీంతో తమన్ నందమూరి ఫ్యామిలీకి ఓ మెంబర్ లా మారిపోయాడు. ఈ విషయాన్ని బాలయ్యే అన్నారు. అంటే బాలయ్య తమన్ కి ఎంతగా కనెక్ట్ అయ్యారు? అన్నది అద్దం పట్టింది.
ప్రస్తుతం బాలయ్య నటిస్తోన్న 'అఖండ 2'కి కూడా థమన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎలాంటి సంగీతం అందిస్తున్నాడు? అన్నది తమన్ ముందే హింట్ ఇచ్చేసాడు. కుర్చీలు..తెరలు తెగిపోయినా తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటనిచ్చి మరింత హైప్ పెంచేసాడు. అంతగా బాలయ్య కు తమన్ కనెక్ట్ అయ్యాడు. మిరిప్పుడు ఈ ద్వయం విడిపోవాల్సిన పరిస్థితి తలెత్తిందా? ఆ ద్వయాన్ని కోలీవుడ్ సంలచనం అనిరుద్ విడగొడుతున్నాడా? అంటే అవుననే లీకులందుతున్నాయి.
'అఖండ 2' తర్వాత బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఇప్పటికే విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు. ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్. ఈ విషయంలో బోయపాటినే కొట్టాలనే కసితో గోపీచంద్ ప్రణాళిక కనిపిస్తుంది. భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు. అయితే ఈసినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ని తీసుకుందామనే ప్రపోజల్ బాలయ్య ముందుకెళ్లిందిట. అందుకు బాలయ్య కూడా తప్పకుండా అంటూ భరోసా ఇచ్చారుట.
వరుసగా తమన్ తో పనిచేస్తున్నాం కదా? ఈ సారి అనిరుద్ తో వెళ్తే ఇంకా కొత్తగా ఉంటుందనే ధీమా తో బాలయ్య కూడా కాదనలేనట్లు కనిపిస్తుంది. అనిరుద్ ఎంట్రీ గనుక ఖాయమైతే? బాలయ్య మాస్ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి అనిరుద్ తోడైతే అది వేరేలెవల్లో ఉంటుంది. 'విక్రమ్' తో కమల్ హాసన్ ని...'జైలర్'తో రజనీకాంత్ ని లేపినట్లు బాలయ్యను కూడా మరింత ఎలివేట్ చేసే అవకాశం ఉంటుంది.
