'అఖండ 2' టీజర్‌పై గోపీచంద్ మలినేని మినీ రివ్యూ
నందమూరి బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో యమ స్పీడు మీదున్నారు. `అఖండ` బ్లాక్ బస్టర్ హిట్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన బాలయ్య అదే జోష్‌తో వరుసగా క్రేజీ యాక్షన్ సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2025 5:19 PM ISTనందమూరి బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో యమ స్పీడు మీదున్నారు. `అఖండ` బ్లాక్ బస్టర్ హిట్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన బాలయ్య అదే జోష్‌తో వరుసగా క్రేజీ యాక్షన్ సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాతికి `డాకు మహారాజ్`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య త్వరలో మరో భారీ యాక్షన్ డ్రామాతో అలరించడానికి రెడీ అవుతున్నారు.
అదే 'అఖండ 2'. బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్వీ నందమూరి ఈ భారీ యాక్షన్ అండ్ డివోషనల్ డ్రామాని నిర్మిస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో ఆదిపినిశెట్టి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని సెప్టెంబర్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
బోయపాటి, బాలయ్యల క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా కావడం, బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ని సోమవారం టీమ్ విడుదల చేస్తోంది. ఎప్పుడెప్పుడు టీజర్ రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా టీజర్ విజువల్స్‌పై ఆసక్తికరంగా స్పందించి హైప్ పెంచేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ని ఉద్యేశించి అఖండ 2 టీజర్‌పై గోపీచంద్ మలినేని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టిం వైరల్‌గా మారింది. 'ఇప్పుడే అఖండ 2 టీజర్ చూశాను. కేవలం శక్తివంతమైనది మాత్రమే కాదు. ఇట్స్ ప్యూర్ రేజ్ దైవత్వంతో నిండి ఉంది బావా. తమన్ బిజిఎమ్ ఓ తాండవంలా ఉంది. ఆ ఒక్క షాట్ నాకు హైని, గూస్‌బంప్స్‌ని తెప్పించింది. ఆ ఫీల్ అంతా ఇప్పటికీ నా మనసులో అలాగే నిలిచిపోయింది. NBK & బోయపాటిల విధ్వంసం జై బాలయ్య' అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని `అఖండ 2` టీజర్‌పై మినీ రివ్యూ ఇచ్చేయడం ఆసక్తికరంగా మారింది.
