ఆదిత్య 999 డైరెక్టర్ మారాడా..?
నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో ఆదిత్య 369 సీక్వెల్ సినిమా చేయాలని చూస్తున్నారు. ఆ మూవీకి ఆదిత్య 999 అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు
By: Tupaki Desk | 25 July 2025 3:06 PM ISTనందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో ఆదిత్య 369 సీక్వెల్ సినిమా చేయాలని చూస్తున్నారు. ఆ మూవీకి ఆదిత్య 999 అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఆదిత్య 999 స్క్రిప్ట్ వర్క్ బాలకృష్ణ దగ్గర ఉండి పూర్తి చేస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి చేశాక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమాతో పాటు ఆదిత్య 999 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తుందట. రెండు సినిమాలను కూడా ఒకేసారి షూటింగ్ చేస్తారని తెలుస్తుంది.
ఆదిత్య 999 సినిమాను మొన్నటిదాకా బాలకృష్ణ స్వీయ డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను క్రిష్ మీద పెట్టినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బాలయ్యతో క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేశాడు. ఆ సినిమా టైం లో అతని వర్కింగ్ స్టైల్ తెలిసింది. అందుకే బాలకృష్ణ మరోసారి క్రిష్ తో పనిచేయాలని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను క్రిష్ కొంత భాగం చేశాడు.
వీరమల్లు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందనడానికి ఆ పోర్షన్ అంతా క్రిష్ డైరెక్ట్ చేసిందని టాక్. ఐతే బాలకృష్ణ ఆదిత్య 999 సినిమాకు మాత్రం క్రిష్ పూర్తిస్థాయి డైరెక్షన్ బాధ్యత నిర్వహిస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు తీసాడు కాబట్టి బాలయ్య కూడా క్రిష్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడట.
ఆదిత్య 999 సినిమాను రాజీవ్ రెడ్డి నిర్మిస్తారని తెలుస్తుంది. క్రిష్ ప్రస్తుతం ఘాటి సినిమా పూర్తి చేశాడు. సెప్టెంబర్ లో ఆ సినిమా వస్తుంది. క్రిష్ నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో దాదాపు ఫిక్స్ అని తెలుస్తుంది.ఐతే దీనికి సంబంధించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.
బాలయ్య ఈమధ్య తన సినిమాల వేగాన్ని పెంచారు. సంక్రాంతికి ఒక సినిమా దసరాకి మరో సినిమా రిలీజ్ అన్నట్టుగా పనిచేస్తున్నారు. అఖండ 2 సినిమా విషయంలో బాలయ్య చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న అఖండ 2 సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తారని తెలుస్తుంది. బాలయ్య బాబు అఖండ 2, ఆదిత్య 999, గోపీచంద్ మలినేని ఈ సినిమాలన్నీ కూడా ఏడాదిలోగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
