సింహాన్ని మించిన సీనియర్!
నటసింహ బాలకృష్ణ చిత్ర పరిశ్రమకొచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవలే ఇండస్ట్రీ గ్రాండ్ గా బాలయ్య పేరిట సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 11:00 PM ISTనటసింహ బాలకృష్ణ చిత్ర పరిశ్రమకొచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవలే ఇండస్ట్రీ గ్రాండ్ గా బాలయ్య పేరిట సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఎంతో గర్వంగా ఫీలయ్యారు. 50 ఏళ్ల పూర్తి చేసుకున్న ఏకైక నటుడిగా తనని తాను ఎంతో గొప్ప గా అభివర్ణించు కున్నారు. వేడుకకు వచ్చిన అతిధుల సహా అంతా బాలయ్య పనితనాని ప్రశంసించారు.
ఇటీవలే బాలయ్య మరో ఈవెంట్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏకైక నటుడిని నేనే నంటూ...భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంకెవరు లేరని అన్నారు. కానీ అసలు సంగతి ఏంటంటే? బాలయ్య కంటే ముందు ఓ నటుడు ఉన్నారు. ఆయనే మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి. బాలకృష్ణ 1974 లో ఇండస్ట్రీకి వస్తే? మమ్ముట్టి 1971 లో చిత్ర పరిశ్రమకి వచ్చారు. ఆయన తొలి సినిమా `అనుభవంగల్ పాలిచెక్క`లో అదే ఏడాది రిలీజ్ అయింది.
ఈ సినిమాలో మమ్ముట్టి జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించారు. సరిగ్గా 2025 కల్లా మమ్ముట్టి పరిశ్రమకొచ్చి 54 ఏళ్లు పూర్తవుతుంది. తొలి సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం నేటివరకూ దిగ్విజయంగా కొన సాగుతుంది. ఇప్పటికే నటుడిగా 400పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించారు. స్టార్ ఇమేజ్ వదిలేసి చేసిన సినిమాలెన్నో. ఇక బాలయ్య 1974లో బాలకృష్ణ` తాతమ్మ కల`తో లాంచ్ అయ్యారు.
అదే ఏడాది ఆసినిమా రిలీజ్ అయింది. అటుపై హీరోగా ఎంట్రీ ఇవ్వడం నుంచి నేటివరకూ ఆయన ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. ఐదు దశాబ్ధాల సినీ ప్రయాణంలో 100కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2 శివ తాండవం` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది.
