Begin typing your search above and press return to search.

బాలయ్య పై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ !

బాలయ్య రెండు కోణాలున్న పాత్రలు పోషిస్తున్నారు

By:  Tupaki Desk   |   15 July 2023 7:37 AM GMT
బాలయ్య పై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ !
X

నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ క్లైమాక్స్ చేరుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రత్యేకంగా సిద్దం చేసిన ఓ భారీ సెట్ లో బాలయ్యపై హై ఓల్డేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. స్టంట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

మరో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని...ఇందులో యాక్షన్ సన్నివేశాలకే పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. బాలయ్యపై షూట్ చేసే యాక్షన్ సన్నివేశాలకు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని...కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లోనూ నటసింహం నటిస్తుందని వినిపిస్తోంది. షూట్ లో భాగంగా పెద్ద ఎత్తున ఫైటర్లు పాల్గొంటున్నారుట. బాలయ్య మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా సన్నివేశాలుంటాయని యూనిట్ వర్గాల నుంచి తెలిసింది.

ఈ యాక్షన్ సన్నివేశాలు పూర్తిచేసిన అనతరం బాలయ్య... కాజల్ జంటపై ఓ పాట చిత్రీకరించను న్నారుట. వచ్చే నెలాఖరుకు దాదాపు సినిమాకి సంబంధించిన పనులు పూర్తిచేయనున్నట్లు సమాచారం.

ఇందులో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలు పోషిస్తున్నారు. రెండు వేటికవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తా యని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక పాత్రతో అనీల్ మార్క్ ఎంటర్ టైనర్ వర్కౌట్ చేసినట్లు సమాచారం.

బాలయ్య లో కామెడీ టైమింగ్ ని ... టింజ్ ని టచ్ చేస్తూ ఆ సన్నివేశాలు షూట్ చేసినట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఈసన్నివేశాల్లో బాలయ్య తెలంగాణ స్లాంగ్ తో కామెడీ పండించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్విస్తాయని చెప్పొచ్చు. ఈ తరహా కామెడీ బాలయ్య కూడా ఇంతవరకూ ప్రయత్నించలేదు.

మరో పాత్ర మాత్రం ఆద్యంతం సీరియస్ గా సాగుతుందని...సినిమాలో ఆ పాత్రని ప్రధానంగా హైలైట్ చేయబోతున్నట్లు సమాచారం. అన్ని పనులు పూర్తిచేసి సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.