Begin typing your search above and press return to search.

బలగం వేణు కమర్షియల్ ఎంటర్టైనర్..?

యంగ్ హీరోతో వేణు సెకండ్ సినిమా ఉంటుందని ఈసారి కమర్షియల్ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడట.

By:  Tupaki Desk   |   19 Aug 2023 3:30 AM GMT
బలగం వేణు కమర్షియల్ ఎంటర్టైనర్..?
X

బలగం సినిమాతో డైరెక్టర్ గా వేణు ఇన్నాళ్లు తన మీద ఉన్న కమెడియన్ ముద్రని చెరిపేసుకుని డైరెక్టర్ గా పర్మినెంట్ మార్క్ సెట్ చేసుకున్నాడు. అదేంటి ఒక్క సినిమాకే డైరెక్టర్ గా ఫిక్స్ అయినట్టేనా అనుకోవచ్చు సినిమా ఒక్కటా పదా కాదు అనుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడా లేదా అన్నది ఇంపార్టెంట్ ఆ విషయంలో బలగం సినిమాతో వేణు డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. ఈ క్రమంలో బలగం తర్వాత వేణు సినిమా చేస్తా అంటే చాలు ఆఫర్ ఇచ్చేందుకు చాలా మంది నిర్మాతలు వచ్చారట.

అయితే తనను నమ్మి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్ లోనే వేణు సెకండ్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. బలగం తర్వాత మళ్లీ అలాంటి ఒక ఎమోషనల్ కథతోనే వేణు సినిమా చేస్తాడని వార్తలు రాగా అందులో వాస్తవం లేదని తెలుస్తుంది. అంతేకాదు ఈసారి వేణు ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. యంగ్ హీరోతో వేణు సెకండ్ సినిమా ఉంటుందని ఈసారి కమర్షియల్ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడట.

దిల్ రాజు నిర్మాత కాబట్టి హీరో ఎవరైనా డేట్స్ ఇవ్వాల్సిందే. మరీ స్టార్ హీరోలైతే ఒక్క సినిమా కాబట్టి వేణు డైరెక్షన్ లో నటించేందుకు అబ్జెక్ట్ చేయొచ్చు కానీ యంగ్ హీరోలు మాత్రం వేణు తో సినిమా రెడీ అనేస్తున్నారు. అయితే వేణు రాసుకున్న కథకు ఎవరు పర్ఫెక్ట్ అన్నది చూసుకుని ఆ హీరో డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని సినిమా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈమధ్య కంటెంట్ ఉన్న సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అందుకే యువ హీరోలంతా అలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

బలగంతో ఒక మార్క్ సెట్ చేసిన వేణు తన సెకండ్ సినిమాతో కూడా కమర్షియల్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. ఇంతకీ వేణు సెకండ్ సినిమా హీరో ఎవరు.. ఎలాంటి కథతో వేణు సినిమా చేస్తాడన్నది త్వరలో తెలుస్తుంది. దిల్ రాజు ఈసారి వేణుకి ఒక కంఫర్టబుల్ బడ్జెట్ ఇచ్చి సినిమా చేయించాలని చూస్తున్నాడట. మొత్తానికి వేణు పాలిట దిల్ రాజు లక్కీ మ్యాన్ గా మారాడని చెప్పొచ్చు. దిల్ రాజు ఓ పక్క బడా స్టార్స్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలతో కూడా తన బ్యానర్ గ్రాఫ్ మరింత పెంచుకుంటున్నాడు. వేణు దిల్ రాజు ఈ కాంబో ఈసారి ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తుందో చూడాలి.