Begin typing your search above and press return to search.

బ్యాడ్ లక్ అంటే ఆ ఇద్దరు హీరోలదే

టాలీవుడ్ లో కొంత మంది హీరోలకి టాలెంట్ ఉంటుంది, మంచి పెర్ఫార్మర్స్ అనే గుర్తింపు ఉంటుంది. అయితే సక్సెస్ లు మాత్రం రావు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 4:30 PM GMT
బ్యాడ్ లక్ అంటే ఆ ఇద్దరు హీరోలదే
X

టాలీవుడ్ లో కొంత మంది హీరోలకి టాలెంట్ ఉంటుంది, మంచి పెర్ఫార్మర్స్ అనే గుర్తింపు ఉంటుంది. అయితే సక్సెస్ లు మాత్రం రావు. కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసిన, ఎలాంటి కొత్త కథ ట్రై చేసిన ఫెయిల్యూర్స్ వెంటాడుతూనే ఉంటాయి. అప్పట్లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన తారకరత్న ఒకేసారి ఎనిమిది సినిమాలు స్టార్ట్ చేసేశాడు.


అందులో మొదటి సినిమా తప్ప మిగిలిన అన్ని డిజాస్టర్ అయ్యాయి. హీరోగా కెరియర్ లో సక్సెస్ అందుకోలేకపోయారు. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మూవీస్ చేసుకున్నాడు. నటుడిగా నిలబడే సమయంలోనే గుండెపోటుతో తారకరత్న చనిపోయారు. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పుకోవాలి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్ కి ఉయ్యాల జంపాల మూవీ హీరోగా ప్రమోషన్ ఇచ్చింది.

ఈ మూవీ సక్సెస్ తో వరుస అవకాశాలు వచ్చాయి. తరువాత రెండు హిట్స్ ఖాతాలో పడ్డాయి. అక్కడి నుంచి అతనికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. కమర్షియల్ లైన్ లో వెళ్లి వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు. రూట్ మార్చి తనకి సెట్ అయ్యే కథలతో మూవీస్ చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. లాస్ట్ గా స్టాండప్ రాహుల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు

ఈ సినిమా బాగుందనే టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. దీంతో కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అలాగే మరో అన్ లక్కీ హీరో అంటే ఆది సాయికుమార్ పేరు చెప్పొచ్చు. సాయి కుమార్ వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ప్రేమకావాలి సినిమాతోసూపర్ హిట్ కొట్టాడు.

తరువాత లవ్ లీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికి అతని కెరియర్ గురించి చెప్పుకుంటే ఈ రెండు సినిమాలే గుర్తుకొస్తాయి. తరువాత చాలా ఆదిసాయికుమార్ చాలా సినిమాలు చేశాడు. ఏ మూవీ కూడా అతనికి సక్సెస్ ఇవ్వలేదు.

కెరియర్ పరంగా ఉపయోగపడలేదు. చివరిగా సిఎస్ఐ సనాతన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. కథలపై పూర్తిగా శ్రద్ధ పెట్టకపోవడం, వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడంతో వీళ్ళ కెరియర్ లో డిజాస్టర్స్ ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు వీరితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. దర్శకులు ముందుకి రావడం లేదు. టాలీవుడ్ లో అన్ లక్కీ స్టార్స్ గా ఈ ఇద్దరు హీరోలు మారిపోయారనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.