Begin typing your search above and press return to search.

చివ‌రికి ఆయ‌నా కాపాడ‌లేక‌పోయాడు!

అదే క్ర‌మంలో బ‌డే మియాన్ చోటే మియాన్ ని మాలీవుడ్ లో విస్త్ర‌తంగా ప్ర‌మోట్ చేసాడు. కానీ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ నిరాశపరిచాయి.

By:  Tupaki Desk   |   10 April 2024 12:39 PM GMT
చివ‌రికి ఆయ‌నా కాపాడ‌లేక‌పోయాడు!
X

అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన బడే మియాన్ చోటే మియాన్ చిత్రం ఈ గురువారం హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో విడుదల కానుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. స‌లార్ లో ప్ర‌భాస్ కి స్నేహితుడిగా న‌టించిన పృథ్వీరాజ్ ఇప్పుడు అందుకు భిన్నంగా హిందీ చిత్రంలో విల‌న్ పాత్ర‌తో మెప్పించ‌నున్నాడు.


అదే క్ర‌మంలో బ‌డే మియాన్ చోటే మియాన్ ని మాలీవుడ్ లో విస్త్ర‌తంగా ప్ర‌మోట్ చేసాడు. కానీ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ నిరాశపరిచాయి. మంగళవారం రాత్రి నాటికి పీవీఆర్-ఐనాక్స్- సినీపోలిస్‌ సహా జాతీయ మల్టీప్లెక్స్ చైన్‌లలో కేవలం 13,000 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. తమిళం, తెలుగు వెర్షన్‌లకు అదే విధంగా స్పందన తక్కువగా ఉంది. మలయాళ వెర్షన్ కోసం జీరో టిక్కెట్ సేల్ చూపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మలయాళ సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద స్టార్ అయిన పృథ్వీ ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మ‌వ్వ‌డం షాక్ కి గురి చేసింది.

స‌లార్ - గోట్ లైఫ్ వంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇలాంటి స‌మ‌యంలో ఒక హిందీ చిత్రాన్ని త‌న మాతృభాష‌లో స‌క్సెస్ చేయ‌డంలో విఫ‌లం కావడం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మాలీవుడ్ ప్రేక్ష‌కులు హిందీ యాక్ష‌న్ సినిమాల‌పై అంత‌గా ఆస‌క్తి లేర‌ని కూడా దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాలి.