Begin typing your search above and press return to search.

బుకింగ్స్ దెబ్బకు.. బడా సినిమా వాయిదా!

బుకింగ్స్ సరిగా జరగకపోవడం వలన సినిమా రిలీజ్ వాయిదా వేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు

By:  Tupaki Desk   |   10 April 2024 5:22 AM GMT
బుకింగ్స్ దెబ్బకు.. బడా సినిమా వాయిదా!
X

బుకింగ్స్ సరిగా జరగకపోవడం వలన సినిమా రిలీజ్ వాయిదా వేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు. అయితే బాలీవుడ్ సినిమాలపై ప్రేక్షకాదరణ రోజురోజుకి తగ్గిపోతుందని అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తోన్న రెస్పాన్స్ బట్టి చెప్పొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరోలు వందల కోట్ల బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథలతో సినిమాలు చేస్తున్నారు అయితే ఈ సినిమాల కథలన్నీ కూడా ఒకే రీతిలో ఉండటంతో ప్రేక్షకులకి రొటీన్ అనిపిస్తోంది.

ఈ ఇంపాక్ట్ బుకింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత ఇంచుమించు అలాంటి కథతోనే సల్మాన్ ఖాన్ టైగర్ 3 అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. హృతిక్ రోషన్ ఫైటర్ అంటూ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ మధ్య వార్ బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు బడ్జెట్ పెంచి హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో చెప్పిన కథలనే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ బడే మియాన్ చోటే మియాన్ అనే మూవీ చేశారు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయట. ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్ కి దగ్గర్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడంతో మూవీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఈ సినిమాని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తున్నారు. అయిన కూడా ప్రేక్షకులు మూవీ పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తోన్న రెస్పాన్స్ బట్టి తెలుస్తోంది.

దీంతో మూవీ రిలీజ్ ని ఒక రోజు వాయిదా వేసి రంజాన్ నాడు ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారంట. ఆ రోజు అయిన ఈ సినిమాకి మంచి ఆదరణ వస్తుందేమో అనేది చూడాలి. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరికీ ఇప్పుడు సాలిడ్ హిట్ కావాలి. కమర్షియల్ హీరోలుగా స్టార్ ఇమేజ్ ఉన్న కూడా గత కొన్నేళ్లుగా వీళ్ళకి సరైన సక్సెస్ లు లేవు. దీంతో బడే మియాన్ చోటే మియాన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్ లో పబ్లిక్ నుంచి మూవీకి స్పందన రాకపోవడం నిర్మాతలని టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది.