ఆస్తిని కూతురికి రాసిస్తున్న మెగాస్టార్?
ప్రతి ఇంట్లో ఆస్తుల గురించి కొట్లాటలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య లేదా అక్కా చెల్లెళ్ల మధ్య కూడా ఇలాంటి గొడవలు రెగ్యులర్ గా చూస్తున్నాం
By: Tupaki Desk | 10 Jun 2025 10:52 PM ISTప్రతి ఇంట్లో ఆస్తుల గురించి కొట్లాటలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య లేదా అక్కా చెల్లెళ్ల మధ్య కూడా ఇలాంటి గొడవలు రెగ్యులర్ గా చూస్తున్నాం. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లోను ఇలాంటి ఒక గొడవ ఉందని చాలా కాలం క్రితం ప్రచారమైంది. ఆస్తిని కూతురికి కొడుకుతో సమానంగా పంచి ఇచ్చేస్తుంటే అది కోడలు ఐశ్వర్యారాయ్ కి నచ్చలేదని అలాగే ఆడపడుచుతో ఐష్ కి అస్సలు సరిపడటం లేదని కథనాలొచ్చాయి.
అమితాబ్ - జయా బచ్చన్ దంపతులు తమ కూతురు కొడుకు ఇద్దరినీ సమానంగా పెంచారు. ఏ విషయంలోను వివక్ష చూపలేదు. ఇప్పుడు ఆస్తుల పంపకం విషయంలోను వారు వివక్ష చూపడానికి సిద్ధంగా లేరు. అమితాబ్ - జయా బచ్చన్ ఇద్దరికీ ఆ ఇద్దరూ రెండు కళ్లు. బిగ్ బి ఒక పాత ఇంటర్వ్యూలో తన ఆస్తికి ఎవరు అర్హులు అని ప్రశ్నించారు.
నేను చనిపోతే నా దగ్గర ఉన్న కొద్ది మొత్తాన్ని నా కొడుకు- కూతురు ఇద్దరికీ సమానంగా పంచేస్తాను అని అన్నారు. ఇందులో ఎటువంటి తేడా ఉండదు... జయ-నేను ఈ సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాము అని అన్నారు. అంతేకాదు ఆడ పిల్ల అంటే వేరొకరి సంపద అని అంటారు. భర్త ఇంటికి వెళుతుంది, కానీ నా దృష్టిలో నా కుమార్తె, ఆమెకు అభిషేక్ లాగా సమాన హక్కులు ఉన్నాయి.. అని అన్నారు. అమితాబ్ , అతడి కుటుంబ ఆస్తుల విలువ సుమారు 1600 కోట్లు. బిగ్ బి తన కుమార్తె శ్వేతకు తన పాత బంగ్లాను బహుమతిగా ఇచ్చారని కథనాలొచ్చాయి. అమితాబ్ బంగళా `` ప్రతీక్ష నేడు రూ. 50 కోట్ల విలువైనది. ముంబైలో ఆయనకు ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. బచ్చన్ కుటుంబానికి అయోధ్య , పూణేలలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటిలో శ్వేతాబచ్చన్ కి అభిషేక్ తో సమాన వాటా ఉంది.