Begin typing your search above and press return to search.

కల్ట్ హిట్టుతో హాట్ టాపిక్ అవుతున్న SKN

అయితే, సినిమాలో హీరో హీరోయిన్లు, మూవీ డైరెక్టర్ ఎంత ఫేమస్ అయ్యారో, మూవీ నిర్మాత కూడా అంతే ఫేమస్ అయ్యారు.

By:  Tupaki Desk   |   21 July 2023 12:04 PM GMT
కల్ట్ హిట్టుతో హాట్ టాపిక్ అవుతున్న SKN
X

టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ఉండి ఉండొచ్చు. అయితే, వారిలో ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వేరు. ఆయన ఓ వైపు పెద్ద సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు చిన్న సినిమాలను కూడా తీసుకువస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు మరో నిర్మాత కూడా దిల్ రాజులా మారిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సంచలనం బేబీ సినిమాని నిర్మించిన నిర్మాత ఎస్ కేఎన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు.

ప్రస్తుతం బేబీ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమా అని పెద్దగా పట్టించుకోనివారు కూడా ఇప్పుడు ఈ మూవీ చూసి షాకైపోతున్నారు. ఈ మూవీ విడుదలైన వారానికే దాదాపు రూ.50కోట్ల గ్రాస్ అందుకోవడం విశేషం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీకి అనూహ్య స్పందన వస్తోంది.

అయితే, సినిమాలో హీరో హీరోయిన్లు, మూవీ డైరెక్టర్ ఎంత ఫేమస్ అయ్యారో, మూవీ నిర్మాత కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఒక సాధారణ పీఆర్ఓ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా మారిపోయారు. ఈ మూవీ కోసం ఆయన దాదాపు మూడు సంవత్సరాలపాటు ఈ మూవీ టీమ్ తో ప్రయాణించారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఆయన ఇంత మంచి సినిమా తీసుకువచ్చారు అని అందరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కేవలం, ఈ మూవీ తీశాడు అని మాత్రమే కాదు, టాలెంట్ ఎక్కడ ఉందో, అటుగా ఆయన తన ప్రయాణం మొదలుపెడుతున్నారు. డైరెక్టర్లు మారుతి, రాహుల్ సంకృత్యాన్, సందీప్ రాజ్, తాజాగా సాయి రాజేష్ వంటి డైరెక్టర్లతో కలిసి టాలీవుడ్ ప్రేక్షకుల మంచి సినిమా అందించారు. దీంతో, మంచి అభిరుచి ఉన్న నిర్మాత అని, టాలెంట్ ని వెతికి టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారంటూ ఆయనను కొనియాడుతున్నారు.

ఇక, ఈ నిర్మాత దేవర కొండ బ్రదర్స్ కి కూడా మంచి లక్కీ ఛామ్ గా మారిపోయాడు అని అంటున్నారు. విజయ్ దేవర కొండతో టాక్సీవాలా హిట్ ఇచ్చిన ఈయన, ఇప్పుడు ఆనంద్ దేవర కొండకు కెరీర్ లో నే బెస్ట్ హిట్ ని అందించారు. ప్రస్తుతం ఈ బేబీ రీమేక్ కోసం ఇతర ఇండస్ట్రీవాళ్లు పోటీలు పడుతున్నారు. ఇక, ఒక సామాన్యుడు ఇంత పెద్ద నిర్మాత గా మారి, టాప్ స్టానానికి చేరుకోవడం ప్రశంసనీయమైన అంశమే అని కొందరు కామెంట్ చేస్తున్నారు.