Begin typing your search above and press return to search.

బేబీ టీమ్.. మళ్ళీ ఇలా..

టాలీవుడ్ లో గతేడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Feb 2024 5:30 PM GMT
బేబీ టీమ్.. మళ్ళీ ఇలా..
X

టాలీవుడ్ లో గతేడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీ.. రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా వైష్ణవి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.

ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా ఆ ప్రాజెక్ట్ కు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్.. ఈ మూవీకి స్టోరీ అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కూడా ఎస్ కే ఎన్ కూడా ఈ మూవీకి సహ నిర్మాతగా మారారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. 2024లోనే విడుదల కానున్నట్లు ప్రకటించారు.

సినిమా టైటిల్ ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఫస్ట్ లుక్ మాత్రం విడుదల చేశారు. సముద్రం పక్కన పడవలో వైష్ణవి కూర్చుని ఏడుస్తూ ఉండగా.. ఆనంద్ మోకాళ్ల మీద కూర్చున్న పోస్టర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ.. బేబీ సీక్వెల్ అని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై మేకర్స్ అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా బేబీ ట్రియోకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. వైష్ణవి చైతన్య, సాయి రాజేష్, ఆనంద్ దేవరకొండ ముగ్గురు కలిసి దిగిన పిక్స్.. నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఓ పార్టీలో వీరు ముగ్గురూ చిల్ అయినట్లు కనిపిస్తోంది. సాయి రాజేష్ ఇరువైపుల నిల్చున్న ఆనంద్, వైష్ణవి.. సెల్ఫీ సింబల్స్ చూపిస్తూ క్రేజీగా పోజులు ఇచ్చారు.

ఆ ఫొటోల్లో బ్లాక్ అండ్ వైట్ చుడీదార్ వేసుకుని హోమ్లీ లుక్ లో వైష్ణవి చైతన్య ఆకట్టుకుంటోంది. ఇక సాయి రాజేష్.. కంప్లీట్ బ్లాక్ లో ఉండగా ఆనంద్ దేవరకొండ లిటిల్ మాసీగా కనిపిస్తున్నారు. బేబీతో వీరి ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయినట్లు తెలుస్తోంది. ఏదైనా ఎక్కడైనా ముగ్గురు ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ గా ఉంటే ఫుల్ కామెడీ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి వీళ్ల కాంబోలో వస్తున్న కొత్త సినిమా ఎలా ఉంటుందో చూడాలి.