Begin typing your search above and press return to search.

బేబీ.. RX 100 రేంజ్ లో గుచ్చుకునేలా ఉంది

అబ్బాయిలని అమ్మాయిలు ఎలా అవసరాలకి వాడుకొని మోసం చేస్తారో ఆర్ఎక్స్ 100 సినిమాలో చూపించారు.

By:  Tupaki Desk   |   14 July 2023 1:21 PM GMT
బేబీ.. RX 100 రేంజ్ లో గుచ్చుకునేలా ఉంది
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ జోడీగా ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం బేబీ. సాయి రాజేష్ ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సెటైరికల్ సినిమాలు చేసిన సాయి రాజేష్ చాలా గ్యాప్ తర్వాత బేబీ మూవీని తెరకెక్కించారు. ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండానే మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం. మూవీ ప్రమోషన్స్ తో ప్రేక్షకులకి భాగా చేరువ అయ్యింది. అలాగే సాంగ్స్, ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఫీల్ గుడ్ లవ్ స్టొరీలు ఇష్టపడే ప్రేక్షకులు బేబీ చూడటానికి థియేటర్స్ కి వెళ్ళారు.

యూఎస్ లో కూడా ఏకంగా 100 కె డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ ప్రీమియర్ షోలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హీరోలు, హీరోయిన్ ముగ్గురు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించారని ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన. అలాగే హీరోయిన్ వైష్ణవి చైతన్యకి అయితే ప్రశంసలు లభిస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవికి బేబీ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని అంటున్నారు.

ఈ చిత్రంతో దర్శకుడిగా సాయి రాజేష్ హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే మొదటి రెండు ఫన్ జోనర్ లో చేసిన మూడో చిత్రంతో ఏకంగా ప్రేక్షకులని కన్నీళ్ళు పెట్టించి హృదయాలకి దగ్గరయ్యాడు. సినిమాలో పాత్రలతో యూత్ అందరూ ఏదో ఒక చోట కనెక్ట్ అవుతారు. అలాగే పాత్రలని తమకి రిలేట్ చేసుకుంటారనే మాట వినిపిస్తోంది.

ఆర్ఎక్స్ 100 మూవీ యూత్ ఆడియన్స్ కి ఎంత భాగా కనెక్ట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అబ్బాయిలని అమ్మాయిలు ఎలా అవసరాలకి వాడుకొని మోసం చేస్తారో ఆర్ఎక్స్ 100 సినిమాలో చూపించారు.

ఆడపిల్లల ప్రేమలో పడి పిచ్చోళ్ళు అయిపోయే కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కారణంగా ఆ మూవీ యూత్ కి భాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు బేబీ చిత్రం కూడా ఫెయిల్యూర్ లవ్ స్టొరీగానే వచ్చి ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది చూడాలి.