Begin typing your search above and press return to search.

ఆహా గుడ్ న్యూస్.. బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

ల‌వ్‌స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని యూత్ ఆడియెన్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యేలా చక్కగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు దర్శకుడు సాయి రాజేశ్

By:  Tupaki Desk   |   18 Aug 2023 10:39 AM GMT
ఆహా గుడ్ న్యూస్.. బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
X

యూత్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ముఖ్యంగా లవర్స్.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెన్సేషన్ సినిమా గురించి ఓ సూపర్ అప్డేట్ ఇచ్చింది ఆహా టీమ్. జులైలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా సూపర్ హిట్ అయిన బేబీ సినిమా ఓటీటీ విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటన చేసింది.

ఆనంద్ దేవరకొండ- వైష్ణవి- విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆనంద్ దేవరకొండకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెెక్కిన ఈ చిత్రం.. మొదటి రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న టోటల్ థియేట్రికల్ రన్ టైమ్ ముగిసేసరికి రూ.70కుపైగా కోట్ల వసూళ్లను సాధించింది. సోషల్ మీడియాలో, టెలివిజన్ మీడియా ఎక్కడ చూసినా అంతా ఈ సినిమా వసూళ్ల గురించే టాక్ నడిచింది.

ట్రయాంగిల్ ల‌వ్‌స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని యూత్ ఆడియెన్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యేలా చక్కగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు దర్శకుడు సాయి రాజేశ్. వాస్తవానికి ఇలాంటి ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లు తెలుగు చిత్రసీమలో చాలానే వచ్చాయి. కానీ ఇది వాటికి భిన్నంగా.. ప్రస్తుత ప్రేమ కథలు ఎలా ఉన్నాయి యువత ఆలోచన ఎలా ఉంది వంటి స్పష్టంగా చూపించేందుకు సాయి రాజేశ్ ప్ర‌య‌త్నించారు.

విఫ‌ల ప్రేమికుడిగా, ఆనంద్ దేవ‌ర‌కొండ, నెగటివ్ టచ్ పాత్రలో హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య‌ తన నటనతో అదరగొట్టేశారు. ముఖ్యంగా వైష్ణవి.. ఇనోసెన్స్, కాస్త క‌న్నింగ్‌నెస్ ఉన్న పాత్రలో వేరియేష‌న్స్ చూపించిన విధానం యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆటోడ్రైవ‌ర్‌గా ఆనంద్‌ దేవ‌ర‌కొండ మంచిగా మెచ్యూర్డ్ యాక్టింగ్‌ చేశారు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో బాగా మెప్పించారు. ఇక ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా స్టైలిష్ గా విరాజ్ తన పాత్రకు తన వంతు న్యాయం చేశారు.

ఫైనల్ గా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తైన నేపథ్యంలో తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది ఆహా. ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. "మరోసారి కల్ట్ లవ్ స్టోరీ ఆఫ్ ది డికేడ్ చూడటానికి సిద్ధంగా ఉండండి. బేబీ మూవీ మిమ్మల్ని మరోసారి ప్రేమలో పడేలా చేస్తుంది. అలాగే కోపం తెప్పిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 25నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంత వరకు ఉండలేకపోతే వెంటనే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 12 గంటల ముందే ఈ సినిమా చూసేయండి" అని ఆహా పేర్కొంది.