Begin typing your search above and press return to search.

రివైండ్ 2023: సైలెంట్‌గా 100కోట్లు కొల్ల‌గొట్టిన సినిమా

2023 సంవత్సరం భారతీయ సినిమాకి అద్భుతమైన సంవత్సరం. బలమైన కంటెంట్, ప్రభావవంతమైన స్టోరి టెల్లింగ్ తో క్వాలిటీ సినిమాల‌ను ప్ర‌జ‌లు ఆస్వాధించారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 4:39 AM GMT
రివైండ్ 2023: సైలెంట్‌గా 100కోట్లు కొల్ల‌గొట్టిన సినిమా
X

2023 సంవత్సరం భారతీయ సినిమాకి అద్భుతమైన సంవత్సరం. బలమైన కంటెంట్, ప్రభావవంతమైన స్టోరి టెల్లింగ్ తో క్వాలిటీ సినిమాల‌ను ప్ర‌జ‌లు ఆస్వాధించారు. చాలా సినిమాలు విజ‌య‌కేత‌నం ఎగురవేశారు. వాటిలో ఒకటి `బేబీ`. సాయి రాజేష్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ- వైష్ణవి- చైతన్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్ర‌మిది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుండి గొప్ప‌ ప్రేమ ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా కంటెంట్ 100 కోట్ల క్లబ్‌లో చేర్చ‌డంలో స‌హ‌క‌రించింది.


ఈ చిత్రం యూత్‌ఫుల్ డ్రామాతో ర‌క్తి క‌ట్టించింది. బేబీలో ఇద్ద‌రు ప్రేమికుల కథలో ట్విస్టులేమిట‌న్న‌ది తెర‌పై ర‌క్తి క‌ట్టించాయి. కాలేజ్ డ్రామా ఆద్యంతం ఉత్కంఠ‌ను క‌లిగిస్తుంది. ఇందులో ప్రేమ‌క‌థ‌ జెన్-Z ప్రేక్షకులను ఆకర్షించింది. న‌టీన‌టుల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌, కథ చెప్పిన విధానం.. సంగీతం ఇలా ప్ర‌తి విభాగానికి మంచి పేరొచ్చింది. 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. తెలుగు పరిశ్రమలో మునుపటి రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ చిత్రం మాస్‌లో కల్ట్ ఫాలోయింగ్‌ను పొందింది. మాస్ నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వారు ఇందులో న‌టించిన ఆనంద్, వైష్ణవిల‌ను ప్ర‌శంసించారు. వైష్ణ‌వి సావిత్రి అంత బాగా న‌టించింద‌ని కూడా కీర్తించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతలు ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకుల కోసం రీమేక్ చేయడానికి తమ ఆసక్తిని కనబరిచారు. బేబీని శ్రీనివాస కుమార్ నాయుడు నిర్మించారు. సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. ఆయ‌నే ర‌చ‌యిత‌. ఈ చిత్రం 2023 జూలై 14న సినిమా విడుదలైంది.